జనాలను ఫూల్స్ చేస్తున్న మోడీ

Modi was fooling People .. కమల్ హాసన్ ఫైర్

మొన్నటికి మొన్న ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఎవరో తనకు తెలియదని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా దేశ ప్రజలందరినీ ప్రధాని ఫోన్ చేస్తున్నారని కమల్ హాసన్ మోడీ పై ఫైర్ అయ్యారు. ఒకపక్క ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. బిజెపి అనుసరించిన విధానాలు, సంస్కరణల పేరుతో ప్రజలకు పెట్టిన ఇబ్బందులు అటు దేశ ప్రజలు, ఇటు వివిధ రాజకీయ పార్టీలు బిజెపి సర్కార్ పై విముఖత వ్యక్తం చేయడానికి కారణమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మోడీ సర్కార్ ని గద్దె దించటమే కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటి మీదకు రావాలని సభలు, సమావేశాలు, ర్యాలీలు ఊపందుకున్నాయి. ఇప్పటికే బీజేపీయేతర కూటమి ఏర్పాటు బిజెపి సర్కార్ కు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ పై ప్రముఖ నటుడు కమల్ హాసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో ని బీజేపీ.. ప్రజలందరినీ ఫూల్స్ చేయాలని చూస్తోందన్నారు. దావోస్ మేథో మథనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.బీజేపీ దేశ ప్రజలను బుద్ధిహీనులనుకుంటోందని వ్యాఖ్యానించారు. రైతులను వెర్రివాళ్లను చేస్తోందని.. అగ్ర వర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ల పేరుతో ఆ వర్గాల ప్రజలను ఫూల్స్ చేయాలనుకుంటోందన్నారు.ఎన్నికలు దగ్గరపడేసరికి .. ఓటర్లను ఫూల్స్ చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఈ రకమైన ప్లాన్స్ వేస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ లో ఐదుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించి విఫలమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్పడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కమల్ హాసన్ బిజెపి సర్కార్ పై విరుచుకుపడ్డారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article