మోది వెబ్ సిరీస్‌

Modi Web series
ప్ర‌స్తుతం సినిమా రంగానికి ధీటుగా డిజిట్ రంగం రాణిస్తోంది. ఓ ర‌కంగా కొత్త టాలెంట్‌ను ప్రూవ్ చేయాల‌నుకునేవారికి డిజిట‌ల్ రంగం బోల్డ‌న్ని అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది. వెండితెర‌క‌కు చెందిన ద‌ర్శ‌కులు చాలా మంది డిజిట‌ల్ రంగంలో కూడా అడుగుపెడుతున్నారు. ఉమేష్ శుక్తా అనే బాలీవుడ్ ద‌ర్శ‌కుడు కూడా ఈ లిస్టులో ఉన్నాడు. `ఓ మై గాడ్‌`(తెలుగులో గోపాల గోపాల‌), 102 నాటౌట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోది బ‌యోపిక్‌ను తీయాల‌నుకుంటున్నాడు. ఈ వెబ్ సిరీస్ ఈరోస్ వెబ్ స్ట్రీమింగ్ యాప్‌లో ప్ర‌ద‌ర్శితం కానుంది. తొమ్మిది బాగాల వెబ్ సిరీస్ ఇది. అయితే ఇందులో స్టార్స్‌ను కాకుండా కొత్త‌వాళ్ల‌ని తీసుకోవాల‌ని ఉమేష్ అనుకుంటున్నాడు. అందువ‌ల్ల మోది పాత్ర‌లో టీవీ న‌టుడు మ‌హేష్ ఠాకూర్‌ను న‌టింప చేస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా  షూటింగ్ స్టార్ట్ చేసి గుజ‌రాత్‌లో చిత్రీక‌రిస్తున్నారు. మార్చి 15కంతా షూటింగ్ పూర్తి చేస్తామ‌ని.. ఇందులో ఎలాంటి రాజ‌కీయ ఎజెండాలు లేవ‌ని అంటున్నారు  ద‌ర్శ‌క నిర్మాత‌లు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article