మళ్లీ మోదీయే ప్రధాని

MODI WILL WIN

  • ఇది ప్రశాంత్ కిశోర్ లెక్క

భారతదేశ ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోదీయే ఎన్నికవుతారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌  కిశోర్‌  అభిప్రాయపడ్డారు. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ ఎన్డీయేలో కీలక నేత అయినప్పటికీ.. ఆయన ప్రధాని రేసులో ఉండబోరని స్పష్టంచేశారు. బీజేపీకి పూర్తి మెజార్టీ రానప్పటికీ నితీశ్‌ అభ్యర్థిత్వం సాధ్యం కాకపోవచ్చునని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. నితీశ్ కుమార్ నిస్సందేహంగా ఎన్డీఏలో పెద్ద నేత అని, అయితే ప్రధాని స్థానంలో ఆయన్ను ఊహించుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. మోదీయే ఎన్డీయే ప్రధాని అభ్యర్థి అని, రానున్న ఎన్నికల్లో గెలిచి.. ఆయన తిరిగి ప్రధాని పదవి చేపడతారని స్పష్టంచేశారు. గత సెప్టెంబరులో జేడీయూలో చేరిన ప్రశాంత్‌ ఇటీవల శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రేను ముంబయిలో కలవడంపై పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో శివసేనకు వ్యూహకర్తగా పనిచేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు.

NATIONAL NEWS

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article