రాఫెల్ డీల్ లో మోడీ పాత్రపై వెలుగుచూస్తున్న నిజాలు

MODI’S ROLE IN RAPHAEL DEAL

దేశంలో బిజెపి ప్రభుత్వం పై యూపీఏ పక్షాలు రాఫెల్ కుంభకోణం విషయంలో యుద్ధం చేస్తున్నాయి. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాఫెల్ డీల్‌లో తాజాగా మ‌రో షాకింగ్ అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ప్రతిపక్షాల చేతిలో అస్త్రంగా మారిన రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలులోని అక్రమాల వ్యవహారం ప్రధాని మోడీకి తలనొప్పిగా మారింది. నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్న నిర్దిష్టమైన ప్రక్రియను పక్కనపెట్టి అస్మదీయులకు లాభం చేకూర్చేలా కుదుర్చుకున్న ఒప్పందం కారణంగానే రాఫెల్‌ యుద్ధ విమానాల ధరలో పెరుగుదల చోటు చేసుకున్నట్లు ఇటీవలి పరిణామాలతో తేటతెల్లమైంది. మోడీ సర్కార్ దాదాపు 41 శాతం అధిక ధరతో యుద్ధవిమానాల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారంటూ ఆంగ్ల పత్రిక ‘ద హిందూ’ సంచలనాత్మక కధనం ప్రచురించింది. ఇందుకు త‌గు ఆధారాల‌ను సైతం తెలియజేస్తూ సవివరంగా వార్తా కథనాన్ని అందించింది. దీంతో బిజెపి ప్రభుత్వం చేసిన రాఫెల్ డీల్ గుట్టురట్టయింది.
`ద హిందూ` ప‌త్రిక అందించిన క‌థ‌నం ప్ర‌కారం, రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలు పై రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరూ లేకుండానే ప్రధాని కార్యాలయ జోక్యంతో ఫ్రెంచ్ అధికారులతో సమాంతర చర్చలు జరిపారు. ఈ చర్చల్లో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అభ్యంతరాలను లేవనెత్తినట్లు ప‌త్రికా క‌థ‌నం తెలిపింది. ఫ్రెంచ్ అధికారులతో జరుపుతున్న రాఫెల్ డీల్ చర్చల్లో రక్షణ శాఖ కీలక అధికారులకు అవకాశం ఇవ్వాలని రక్షణశాఖ సూచించినా పట్టించుకోకుండా 126 యుద్ధ విమానాల కొనుగోలు పై ప్రధాని మోడీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది.
యూపీఎ హయాంలోనే చేసుకున్న ఒప్పందాన్ని కాదనిప్రధాని మోడీ ఏకపక్షంగా 2015 ఏప్రిల్‌ 10న పారిస్‌ పర్యటనలో కొత్త ఒప్పందాన్ని చేసుకున్నారు. పాత ఒప్పందం రద్దు ప్రక్రియ మార్చి, 2015 నుంచి ప్రారంభించి, 2015 జూన్‌ నాటికి పూర్తి చేసినట్టు మోడీ సర్కార్‌ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అయితే సుప్రీంకోర్టుకు ఇచ్చిన నోట్‌పై తేదీగానీ, సంతకంగానీ లేవు. కాబట్టి అధికారిక వివరణ ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం వెనకాడిందని అర్థమ‌వుతోందని పేర్కొంది. 2015 జూన్‌ 24న అధికారికంగా పాత ఒప్పందం రద్దు అయ్యిందన్న విషయం పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ నివేదికలోనూ తెలిపారు. కానీ, ఇదంతా నిజం కాదని ఫ్రెంచ్‌ సెనేట్‌ పత్రాల ద్వారా తేలింది. పాత ఒప్పందం రద్దు చేసుకోకుండానే, కొత్త ఒప్పందాన్ని (36 రాఫెల్‌ యుద్ధ విమానాలు) ప్రధాని మోడీ ఏకపక్షంగా చేసుకొచ్చారన్నది స్పష్టమైందని హిందూ క‌థ‌నం వెల్ల‌డించింది. అయితే ఈ వ్యవహారంలో అక్టోబరు 2018లో సుప్రీం కోర్టుకు తెలిపిన వివరాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.రాఫెల్ డీల్ కు సంబంధించిన చర్చల్లో ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం చర్చల్లో పాల్గొన్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ డీల్ లో ప్రధాన మంత్రి కార్యాలయం ఎటువంటి జోక్యం చేసుకోలేదని కోర్టుకు తెలిపింది . అయితే, తాజాగా అవి అస‌త్య‌మ‌ని తేలింద‌ని హిందూ క‌థ‌నం పేర్కొంది. దీంతో రాఫెల్ డీల్ లో మోడీ బుక్ అయ్యే మరో అంశం వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి మరో అస్త్రం దొరికినట్టయ్యింది .

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article