కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు తెలంగాణా సర్కార్ పై కోపం

Mohan Babu Angry on  Telangana Government… ఎందుకంటే

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన పదం ఫసక్.. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం ఈ పదం చాలా పాపులర్ అయింది. మరింత పాపులారిటీ కి కారణం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇప్పుడు ఈ మాటతో ఆడియోలు , వీడియోలు అన్నీ వచ్చేశాయి సోషల్ మీడియాలో. రేపో మాపో సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదు. అసలు ఈ మాటకు ఆద్యుడు, ఆల్ ఇండియా పేటెంట్ రైట్ హోల్డర్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో ఈ ఫసక్ అనే పదాన్ని మోహన్ బాబు వాడారు. అప్పటినుంచి ఈ పదం వైరల్ అయ్యింది. అలాంటి ఫసక్ స్టార్ కి ఇప్పుడు కోపం వచ్చింది. ఆ కోపం కూడా తెలంగాణ సర్కార్ పై. రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పట్ల అభిమానాన్ని ప్రదర్శించిన మోహన్ బాబు ఒక్కసారిగా తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కధ ఏంటి అంటే తెలుగు సినిమా ప్రపంచం లో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకరత్న దాసరి నారాయణ మరణం తర్వాత ఆయన జ్ఞాపకార్థం పాలకొల్లులో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాసరి విగ్రహావిష్కరణకు పాలకొల్లు వెళ్లారు మోహన్ బాబు విగ్రహ ఆవిష్కరణ తర్వాత చాలా ఆవేశంగా మాట్లాడారు. దాసరి పుట్టినూరు పాలకొల్లులో ఇంత గొప్పగా విగ్రహం పెడితే.. హైదరాబాద్ లో కనీసం విగ్రహం పెట్టేందుకు స్థలం కూడా ఇవ్వలేదని బాధపడ్డారు. అంటే.. మోహన్ బాబు పరోక్షంగా తెలంగాణ సర్కార్ ఇవ్వలేదని చెప్పినట్లే. సాధారణంగా కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మినహా మిగిలిన వారెవ్వరూ కామెంట్ చేసేందుకు సాహసించరు. సినిమా వాళ్లు అయితే మరీ. కాళ్లమీద పడరు కానీ అంతకన్నా ఎక్కువే. కానీ మోహన్ బాబు స్టైలే డిఫరెంట్. ఆయన మనసులో ఉన్నది బయట చెప్పడానికి ఏ మాత్రం మోహమాట పడరు. అందుకే.. ఉన్న విషయాల్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ సర్కార్. . దాసరి విగ్రహం పెట్టేందుకు స్థలం కేటాయిస్తుందో లేదో చూడాలి. మొత్తానికి టిఆర్ఎస్ పార్టీని అభిమానించే, తెలంగాణ సర్కార్ ని గౌరవించే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కి కోపం వచ్చింది. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల పట్ల సానుకూలంగా వ్యవహరించే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యవహారంలో మరి ఎలాంటి చొరవ చూపిస్తారో చూడాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article