వైసీపీ లోకి నటుడు మోహన్ బాబు ?

Mohan Babu Joining YSR CP

ఏపీలో ఎన్నికల సమీపిస్తుంటే రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో వివిధ పార్టీల నాయకులే కాదు, సినీ వర్గాలు సైతం రాజకీయాల్లో తమ వంతు పాత్ర పోషించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. గతంలో టిడిపి తరఫున రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన విలక్షణ నటుడు మోహన్ బాబు ఈసారి ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం బయటకు చెప్పకపోయినా మంచు కుటుంబం వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.
సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన మంచు కుటుంబం క్రమంగా రాజకీయాలపై కూడా దృష్టి సారిస్తుంది. మోహన్ బాబు ఇదివరకే టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు కూడా. ఐతే ఇప్పుడు మోహన్ బాబు మరియు అతని కుమారులు ఇద్దరు కూడా వైసీపీ లో చేరి జగన్ కి మద్దతుగా నిలవనున్నారని సమాచారం… మనోజ్ ఎప్పటికి సామజిక మాధ్యమాల్లో ఉంటూ, సోషల్ ఇష్యూస్ తో కూడిన ట్వీట్స్ చేస్తూ పొలిటికల్ టచ్ ఇస్తూ అందరిని అలెర్ట్ చేస్తున్నాడు. ఇటీవలే మోడీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసాడు మరియు పవన్ కి కాంప్లిమెంట్ఇస్తూ జనసేనను పొగిడారు.
అయితే మనోజ్ సోదరుడు మంచు విష్ణు ఇంకొంచెం లోతుగా అలోచించి మరొక అడుగు వేశారు. ఈరోజు విష్ణు తన భార్యతో కలిసి లోటస్ పాండ్ కి వెళ్లి మరీ జగన్ ని కలిసి, కాసేపు ఆలా జగన్ తో తన సమయాన్ని గడిపి వచ్చారు. కానీ గత కొంత కాలంగా జగన్ కుటుంబంతో మోహన్ బాబు కుటుంబానికి బంధుత్వం వుంది కనుక.. ఇది క్యాజువల్ విజిట్ మాత్రమేనని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.కానీ చిత్తూరు జిల్లాతో ఎప్పటినుంచో అనుబందాన్ని కలిగివున్న మోహన్ బాబు, విద్యానికేతన్ పేరుతో అక్కడ ఎడ్యుకేషన్ సర్వీస్ కూడా చేస్తున్నారు. మోహన్ బాబుకి తిరుపతి అసెంబ్లీ సీటు ఇచ్చి బరిలోకి దింపనున్నారని సమాచారం. మొత్తానికి మంచు కుటుంబం కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article