బాబు మోహన్ బాబు మనసును గాయపరిచాడా?

Mohan Babu Sensational Comments on Chandrababu

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై సీనియర్ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. . చంద్రబాబు తన మనసు గాయపరిచారంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలైపోయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారని, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారని, అంతా ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో మళ్ళీ ఇలా తన మనసును ఇబ్బంది పెడతావనుకోలేదని ట్వీట్ చేశారు. క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్‌బాబు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. తన మనసును చంద్రబాబు గాయపరిచారని, ఎన్టీఆర్, అక్కినేని లాంటి సినీ పెద్దలు, సినీ పరిశ్రమ తన క్రమశిక్షణ గురించి ఎన్నో సార్లు కొనియాడారని.. అది అందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేశారు. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు ఒక్కరేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దయ చేసి ఏ సందర్భంలోనూ తన పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించొద్దని విజ్ఞప్తి చేశారు. అది ఇరువురికి మంచిది కాదన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందామని , అది కూడా ఇష్టం అయితేనే అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.

tags : TDP, chandrababu, mohan babu, discipline, twitter, tweet

ఎల్వీ సుబ్రమణ్యంపై జగన్ ఎందుకు వేటు?

ఆర్టీసీ ఇప్పట్లో కోలుకోదన్న ఎర్రబెల్లి

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article