15 లక్షలతో 4 కోట్లు సంపాదించాడు

MONEY EARN IN FUNCTION

ఆ రైతు పుట్టెడు కష్టాల్లో ఉన్నాడు. అంతే బంధుమిత్రులందరినీ పిలిచి భోజనాలు పెట్టాడు. అంతే రూ.4 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? ఆ ఊళ్లో ఉన్న ఆచారం వల్ల ఇది సాధ్యమైంది. తమిళనాడులోని పుదుక్కోట జిల్లా కీరామంగళం అనే ఊళ్లో ఓ వినూత్న ఆచారం ఉంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే.. బంధు మిత్రులందరినీ పిలిచి భోజనాలు పెడతారు. దీంతో భోజనానికి వచ్చినవారు తృప్తిగా తిని భారీగా చదివింపులు చదివిస్తారు. దీంతో సదరు వ్యక్తుల కష్టాలు తీరతాయి. ఈ నేపథ్యంలో ఆ ఊరికి చెందిన కృష్ణమూర్తి అనే రైతు పీకల్లోతు అప్పలు నుంచి బయట పడేందుకు భోజనాలు ఏర్పాటు చేశాడు. బంధుమిత్రుల్ని ఆహ్వానించాడు. ఏకంగా రూ.15 లక్షలు వచ్చించి అందరికీ చక్కని భోజనం పెట్టాడు. వచ్చినవారంతా భోజనాలు చేసి భారీగా చదివింపులు చదివించి వెళ్లారు. అవన్నీ లెక్కిస్తే రూ.4 కోట్లు వచ్చినట్టు తేలింది. దీంతో కృష్ణమూర్తి కూడా అవాక్కయ్యాడు. ఏదో తన అప్పులు తీరిపోయే మొత్తం వస్తుందనుకుంటే ఏకంగా కోటీశ్వరుడైపోయాడు. అన్నట్టు అక్కడ వచ్చిన చదివింపులను లెక్కించడానికి బ్యాంకు నుంచి నోట్ల లెక్కింపు యంత్రాలు కూడా తీసుకొచ్చారండోయ్. మొత్తమ్మీద వారి ఆచారం భలేగా ఉంది కదూ?

GENERAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article