ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన పెంచాలి

  • ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన పెంచాలి
    *వైద్య ఆరోగ్య శాఖ పై ముఖ్యమంత్రి సమీక్ష
    అమరావతి:వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, ఆరోగ్యశ్రీ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడెఉతూ ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలి. ఆరోగ్యశ్రీలో పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా చూడాలి. ఆరోగ్య శ్రీకి పేషెంట్లను రిఫర్చేసే విధానం బలోపేతంగా ఉండాలి. రిఫరల్ విధానాన్ని పర్యవేక్షణ చేయండి. విలేజ్ క్లినిక్స్లో రిఫరల్ కోసం పర్మినెంట్ ప్లేస్ను డిజైన్ చేయాలి. విలేజ్ క్లినిక్స్ అన్నవి రిఫరల్ కేంద్రాలుగా పనిచేస్తాయి. ఎక్కడికి రిఫరల్ చేయాలన్నదానిపై హోర్డింగులు ఏర్పాటు చేయడంతో పాటు, అక్కడ పూర్తి సమాచారాన్ని ఉంచాలి. ఆరోగ్యశ్రీ అందుకున్న తర్వాత లబ్ధిదారులకు లేఖ అందాలి. పథకం ద్వారా తనకు అందిన లబ్ధిని అందులో పేర్కొనాలి. ఆరోగ్యశ్రీలో ఆస్పత్రి నుంచి పేషెంట్ బయటకు వెళ్తున్నప్పుడు తనకు అందిన వైద్య సేవలపై కన్ఫర్మేషన్ తీసుకోవాలి. పేషెంట్ తిరిగి కోలుకున్నంతవరకూ అందిస్తున్న ఆరోగ్య ఆసరా విషయాలు కూడా కన్ఫర్మేషన్ పత్రంలో ఉండాలి. ఆరోగ్య ఆసరా డబ్బు నేరుగా వారి వ్యక్తిగత ఖాతాకు డీబీటీ విధానంలో చేస్తున్న పద్ధతిని కొనసాగించాలని అన్నారు.
    ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రత్యేక ఖాతాలను తెరవాలి. ఆరోగ్యశ్రీ కింద అందించే డబ్బును నేరుగా ఈ ఖాతాకు పంపాలి. ఈ ఖాతా నుంచి ఆటోమేటిక్గా వైద్యం అందించిన ఆస్పత్రికి వెళ్లాలి. ఈమేరకు కన్సెంట్ పత్రాన్ని పేషెంట్నుంచి తీసుకోవాలి. తన వ్యక్తిగత ఖాతా విషయంలో ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా ఈ ప్రత్యేక అకౌంట్ వినియోగపడుతుంది. ఈ విధానాల వల్ల పారదర్శకత వస్తుంది. తనకు చేసిన వైద్యం, ప్రభుత్వం నుంచి అందిన సహాయం, అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లింపులు అంతా కూడా పారదర్శకంగా ఉంటాయి. మరింత జవాబుదారీతనం, పారదర్శకత వస్తుందని అన్నారు.
    రోగిపై అదనపు భారాన్ని వేయకుండా, వారికి పూర్తిగా ఉచితంగా వైద్య సేవలందే పరిస్థితి వస్తుంది. ఆరోగ్య మిత్రలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవలకు ప్రభుత్వం మొత్తం చెల్లిస్తుంది. దీనికి అదనంగా డబ్బు వసూలు చేసే పరిస్థితి ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామన్న సంకేతం వెళ్లాలి. అదనంగా తన వద్దనుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదన్న కన్ఫర్మేషన్ పేషెంట్ నుంచి తీసుకోవాలి. ఏమైనా ఫిర్యాదులు ఉంటే.. ఏ నెంబరుకు కాల్ చేయాలన్న విషయం కూడా పేషెంట్కు తెలియాలి. ఆరోగ్య మిత్రలు క్రియాశీలంగా వ్యవహరించేలా చూడాలి. పేషెంట్ అస్పత్రిలో చేరిన దగ్గరనుంచీ డిశ్చార్జి అయ్యేంత వరకూ వారికి అండగా, తోడుగా నిలవాలి. పేషెంట్ ఇంటికి వెళ్లిన తర్వాత ఆరోగ్యకార్యకర్త ఆ ఇంటికి వెళ్లి బాగోగులు చూడాలి. ఆరోగ్యశ్రీ ద్వారా అందిన సేవలు, ఆరోగ్య మిత్రలనుంచి అందిన సహాయం తదితర సేవలపై వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని అన్నారు.
    అలాగే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది కొరత ఉండకూడదు. బోధనాసుపత్రుల్లో కూడా ఎక్కడా సిబ్బంది కొరత ఉండకూడదు. ఏ కారణం వల్ల అయినా పోస్టులు ఖాళీ అయితే వెంటనే వాటిని భర్తీచేయాలి. వివిధ రంగాల్లో మనం సంస్కరణలతో ముందుకు సాగుతున్నాం. మంచి ఫలితాలు రావాలంటే… సరిపడా సిబ్బందిని నియమించుకోవడం తప్పనిసరి. పీహెచ్సీల నుంచి బోధనాసుత్రుల వరకూ ఎక్కడా కూడా డాక్టర్ల నుంచి సిబ్బంది కొరత ఉందనే మాట రాకూడదు. పదవీ విరమణ చేసిన వైద్యులు, ఆ రంగంలోని రిటైర్డ్ సీనియర్ల సేవలను వినియోగించుకోండి. Qవసరమైతే వారి పదవీవిరమణ వయస్సును కూడా పెంచే ఆలోచన చేయాలి. జులై 26 నాటికల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఈ మొత్తం ప్రక్రియ ముగియాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు.
    ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (వ్యాక్సినేషన్ అండ్ కోవిడ్ మేనేజిమెంట్) ఎం రవిచంద్ర,ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article