పార్టీ నుంచి వలసలు ఇంకా ఉంటాయ్..

MORE LEADERS QUIT TDP

  • నేతలతో సీఎం చంద్రబాబు వెల్లడి
  • ఎలా ఆపాలో తెలియక మథనపడుతున్నటీడీపీ అధినేత

ఎన్నికలు వస్తున్నాయంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వలసలు కామనే. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడ కూడా వలసలు భారీగానే కొనసాగుతున్నాయి. అధికార టీడీపీ నుంచి ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరిపోయారు. వారం రోజుల వ్యవధిలోనే వరుసబెట్టి చోటుచేసుకున్న ఈ పరిణామాలతో టీడీపీకి షాక్ తగిలింది. అయితే, ఇది ఇంతటితో ఆగదని, ఈ వలసలు ఇంకా కొనసాగుతాయని అంటున్నారు. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబే ఈ సంగతిని పార్టీ నేతలకు తెలియజేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వలసలు పార్టీకి అంత మంచిద కాదని, పార్టీని వీడి వెళ్లేవారిని ఎలాగైనా ఆపాలని నేతలకు సూచించినట్టు సమాచారం.

లండన్ లో చదువుతున్న తన కుమార్తెను చూడటానికి జగన్ ఈనెల 20న లండన్ వెళుతున్నారు. తిరిగి ఆయన ఈనెల 26న హైదరాబాద్ వస్తారు. అప్పుడు మరిన్ని చేరికలు ఖాయమని అంటున్నారు. ఈ జాబితాలో చాలా పెద్ద పెద్ద నేతలే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలోనూ మంచి పట్టున్న టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వంటి నేతలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం బీజేపీలో ఉన్న  మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కూడా జగన్ రాగానే వైసీపీలోకి చేరిపోయేందుకు సిద్దంగా ఉన్నట్టు చెబుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ తో భేటీ అయ్యారు. ఆమె ఈనెల 28న వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. ఈ పరిణామాలన్నీ తెలుగు తమ్ముళ్లలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

AP POLITICS

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article