తల్లి బీజేపీ కొడుకు వైసీపీ

Mother BJP  Son YSRCP .. దగ్గుపాటిపై మంత్రి నారాయణ ఫైర్

కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. అయితే ఎన్టీఆర్ తనయ పురంధరేశ్వరి మాత్రం బిజెపి లోనే కొనసాగుతుందని దగ్గుబాటి తేల్చి చెప్పారు. పరుచూరు నుండి వైసిపి అభ్యర్థిగా దగ్గుపాటి కుమారుడు హితేష్ చెంచు రామ్ ను రంగంలోకి దింపాలని భావిస్తున్న నేపథ్యంలోనే తండ్రి కుమారులు వైసిపి తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వైయస్ జగన్తో భేటీ అయిన వారు త్వరలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన దగ్గుబాటి ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీనికి కౌంటర్ గా చంద్రబాబు దగ్గుబాటి మారని పార్టీ లేదు అంటూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. వాటి పార్టీ మారే అంశంపై ఏపీ మంత్రి నారాయణ సైతం స్పందించారు
దగ్గుబాటి వెంకటేశ్వర కుటుంబం లాలూచీ పరాకాష్టకు చేరుకుందని ఏపీ మంత్రి నారాయణ విమర్శించారు. తల్లి పురంధేశ్వరి బీజేపీలో ఉండగా, ఆమె కుమారుడు ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారని మండిపడ్డారు. అధికారం కోసమే జగన్ కు దగ్గుబాటి కుటుంబం వంత పాడుతుందని ఆరోపించారు. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజలు అగ్నిగుండంలా మండిపోతున్నారని, ఆ అగ్నిగుండంలో వైసీపీ, బీజేపీ దగ్ధం అవుతాయని నారాయణ జోస్యం చెప్పారు. మొత్తానికి ఇప్పుడు ఏపీలో దగ్గుబాటి వైసిపి తీర్థం పుచ్చుకునే అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారింది. తల్లి బిజెపి, కొడుకు వైసీపీలో ఉండనున్న నేపథ్యంలో అది కాస్తా టిడిపికి అస్త్ర మైంది.

Check Out Latest Offers in Amazon

For more Filmy News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article