మోటరోలా నుంచి ఫోల్డబుల్ ఫోన్?

Motorola Foldable Phone

  • వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం
  • ధర రూ.లక్ష పైనే ఉండొచ్చని అంచనా

ప్రస్తుత ప్రపంచం స్మార్ట్ ఫోన్లదే. మొబైల్ ఫోన్ల కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల మోడళ్లతో మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. ఒకప్పుడు చిన్న ఫోన్లు రాజ్యమేలగా.. ఇప్పుడు చేటంత ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో దర్శనమిస్తున్నాయి. అలాగే గతంలో ఎంతో ఆదరణ చూరగొన్న ఫోల్డబుల్ ఫోన్ల పై మళ్లీ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో శాంసంగ్, ఎల్ జీ, హువావే వంటి మొబైల్ తయారీ దిగ్గజాలు మళ్లీ ఫోల్డబుల్ ఫోన్ల వైపు దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ కంపెనీ మోటరోలా కూడా ఆ దిశగా చర్యలు చేపట్టినట్టు తెలిస్తోంది. తన ఐకానిక్‌ మోడల్‌  మొబైల్‌ను మళ్లీ తీసుకురాబోతోందన్నవార్తలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా చక్కని ఫీచర్లతో తన పాపులర్‌ మోడల్‌ ‘మోటరోలా రాజర్’ను ఫోల్డబుల్ తరహాలో మళ్లీ తీసుకురాబోతోంది. ప్రీమియం ధరలో వచ్చే నెలలోనే ఈ ఫోన్ ను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అద్భుత ఫీచర్లతో పూర్తిగా కొత్తగా రూపొందించిన ఈ ఫోన్ ధర దాదాపు రూ.లక్ష వరకు ఉండొచ్చని అంచనా. ఇప్పటికే అల్ట్రా థిన్‌ స్టయిలిష్‌ డిజైన్‌తో మోటరోలా రాజర్‌ వి3ను 2004లో మొదటిసారిగా తీసుకొచ్చి, యంగ్‌ మొబైల్‌ యూజర్లలో ట్రెండ్‌సెట్‌ చేసింది. మధ్యలో తన ప్రాభవాన్నికోల్పోయిన మోటరోలా.. 2011, 2012సంవత్సరాల్లో మళ్లీ ప్రపంచంలోనే పలుచనైన మొబైల్‌.. డ్రాయిడ్‌ రాజర్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఫోల్డబుల్‌ ఫోన్ తో వినియోగదారులను ఆకట్టుకోవాలని యోచిస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article