ఒకటొకటిగా ఓటిటికే ..?

54
Movies in OTTs
Movies in OTTs

movies cue to OTT

అన్ లాక్ -4 లోనూ సినిమా థియేటర్స్ పర్మిషన్ లేదు. దీంతో ఇక థియేటర్స్ ఈ డిసెంబర్ వరకూ ఓపెన్ కాకపోవచ్చు అనేది తేలిపోయింది. అప్పటి వరకూ వెయిట్ చేయకుండా నాని, సుధీర్ బాబు నటించిన వి సినిమా ఓటిటిలో విడుదలవుతోంది. వచ్చే నెల 5న అమెజాన్ లో విడుదలవుతోందీ చిత్రం. అంతా ముందుగానే ఊహించినట్టుగా దిల్ రాజు వంటి నిర్మాతే వితో ఓటిటిలోకి ఎంటర్ అవుతోంటే ఇక ఇతర నిర్మాతలు మాత్రం థియేటర్స్ కోసం వెయిట్ చేస్తారా..? యస్.. అంతా ఇక ఒకరొకరుగా ఓటిటి రూట్ ను క్లియర్ చేసుకుంటున్నారు. కాకపోతే ఆ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ముందుగా అడిగినప్పుడు ఇచ్చేస్తే మంచి రేట్ వచ్చేదే. కానీ ఇప్పుడు వీళ్లే అడుగుతున్నారు కాబట్టి ఆ వైపు నుంచి కాస్త కోతలు పడే అవకాశం ఉంది. ఇక వి రూట్ లో అనుష్క నిశ్శబ్ధం వస్తోంది. నిజానికి ఈ మూవీ ఎప్పుడో రావాల్సింది. ఏదైతేనేం.. వి రూట్ లో నిశ్శబ్ధం కూడా వచ్చేస్తోంది. అలాగే ఆన్ లైన్ బ్యూటీ క్వీన్ కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా సైతం ఓటిటి రిలీజ్ డేట్ ను సెట్ చేసి మరీ పెట్టేసుకుంది. ఇక సెప్టెంబర్, అక్టోబర్ లో కూడా థియేటర్స్ ఓపెన్ కావు అని తేలిపోయింది కాబట్టి.. ఇక ఇప్పటి వరకూ ఏదో రకంగా ఆశించిన సినిమాలు కూడా ఆన్ లైన్ లోకి రాబోతున్నాయి. వీటిలో ప్రధానంగా వినిపిస్తోన్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్.

సాయిధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటించిన సినిమా ఇది. ఈ మూవీ వచ్చిన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం వీరూ ఓ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ తో చర్చలు జరుపుతున్నారు. లేటెస్ట్ గా రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, మాళవిక నాయర్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’కూడా ఫైనల్ గా ఓటిటికే ఓటేసింది. ఇష్క్ ఫేమ్ కొండా విజయ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని కెకె రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా మార్చి 25న విడుదల కావాల్సి ఉంది. కానీ మూడు రోజుల ముందే లాక్ డౌన్ అనౌన్స్ కావడంతో ఆగిపోయింది. ఇన్నాళ్లూ థియేటర్ కోసమే ఎదురుచూసిన బుజ్జిగాడు కూడా ఇక ఓటిటికి రాక తప్పడం లేదు. త్వరలోనే ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ తో పాటు రిలీజ్ డేట్ కూడా చెబుతారట. ఇక ప్రస్తుతం అన్ని విధాలుగా రెడీ అయి విడుదలకు ఎదురుచూస్తోన్న సినిమాల్లో రెడ్, ఉప్పెన సినిమాలున్నాయి. రామ్ సంక్రాంతికి అనుకుంటున్నాడు. ఉప్పెన నుంచి ఆల్రెడీ సంక్రాంతికి వస్తాం అని ప్రకటించారు. కానీ ఈ రెండు సినిమాలూ అప్పటి వరకూ ఆగకపోవచ్చు అనేది విశ్లేషకుల అంచనా. మొత్తంగా ఈ మొత్తం సినిమాల విషయంలో ఫ్యాన్స్ కూడా ఇక థియేటర్ ఎక్స్ పీరియన్స్ వదులుకుంటేనే మంచిదేమో.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here