నలుగురు క్వీన్ లూ ఓటీటీకేనా..?

30
Movies in OTTs
Movies in OTTs

Movies in OTTs

అది ఎప్పుడో పూర్తయిన సినిమా. పైగా రీమేక్. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన క్వీన్ చిత్రాన్ని సౌత్ లో ఏకంగా నాలుగు భాషల్లో రీమేక్ చేశారు. నాలుగు భాషల్లోనూ నలుగురు వేర్వేరు హీరోయిన్లు. తెలుగులో తమన్నా, తమిళ్ లో కాజల్ అగర్వాల్, కన్నడలో పారుల్ యాదవ్, మళయాలంలో మంజిమా మోహన్. పైగా ఈ నాలుగు భాషల్లోనూ టైటిల్స్ కూడా వేర్వేరుగా ఉన్నాయి. దీంతో ఆ టైమ్ లో ఈ ప్రాజెక్ట్ పై చాలామంది ఆసక్తిగానే చూశారు. నాలుగు సినిమాలనూ నలుగురు వేర్వేరు దర్శకులు డైరెక్ట్ చేశారు. అది కూడా అటెన్షన్ పే చేసింది. అనుకున్నట్టుగానే సినిమా కాస్త ఇబ్బందులు పడ్డా ఆఖరికి పూర్తయింది. టీజర్స్ కూడా విడుదల చేశారు. ఒక్క తెలుగు టీజర్ తప్ప మిగతావి ఫర్వాలేదు అనిపించుకున్నాయి. మరి ఏమైందో కానీ.. ఈ సినిమా రెండేళ్లుగా విడుదలకు నోచుకోవడం లేదు. రెండేళ్ల వరకూ ఎందుకు జనం మర్చిపోయి కూడా యేడాది పైనే అయింది. అయితే లేటెస్ట్ గా మరోసారి ఈ క్వీన్ తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ లో విడుదల కావాల్సిన సినిమాలు కూడా ఓటీటీలో విడుదలవుతున్నాయి కదా.

దుకే ఈ చిత్రాలను కూడా ఓటీటీలోనే వదలాలనుకుంటున్నారట. ముఖ్యంగా తెలుగు వెర్షన్ గా వస్తోన్న ‘దటీజ్ మహాలక్ష్మి’చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని దేవా కట్టా డైరెక్ట్ చేశాడు. కానీ మధ్యలో అభిప్రాయ భేదాల కారణంగా వదులుకున్నాడు. అటుపై ప్రశాంత్ వర్మ పూర్తి చేశాడు. కానీ తనకు డైరెక్టర్ గా క్రెడిట్ వద్దన్నాడట ప్రశాంత్. కారణాలేంటో కానీ.. ఈ వెర్షన్ కాస్త ఇబ్బందులు పడిందనేది నిజం. మొత్తంగా దటీజ్ మహాలక్ష్మి ఓటిటికి వెళితే ఇతర మూడు భాషల్లోని సినిమాలు కూడా ఓటిటి వైపు చూసే అవకాశం ఉంది. మరో విశేషం ఏంటంటే.. కన్నడలో  ఈ చిత్రానికి నిర్మాత కూడా హీరోయిన్ పరుల్ యాదవ్ కావడం.. మరి ఈ నలుగురు క్వీన్స్ లో ఏ క్వీన్ కు ఓటీటీలో బెస్ట్ మార్కులు వస్తాయో చూడాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here