పోలీసుల తీరుపై గల్లా ఫైర్ ..మంజూరైన బెయిల్

mp galla jayadev fires on ap police
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి సబ్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.  అయితే  మంగళగిరి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది .గుంటూరు జిల్లా  సబ్ జైలు నుంచి బయటికి వచ్చిన జయదేవ్  మీడియాతో మాట్లాడారు . పోలీసులతీరుపై ఫైర్ అయ్యారు .
మేం శాంతియుతంగా ఉద్యమించేందుకు ప్రయత్నించినా, పోలీసులే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయారు. మేం వారిపై రాళ్లు వేశామని ఆరోపణలు చేశారు. వాళ్లపై వాళ్లే మట్టి వేసుకుని, అక్కడినుంచి లాఠీచార్జి చేయడం మొదలుపెట్టారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు అని చూడకుండా విచక్షణ లేకుండా కొట్టారు.లాఠీచార్జి మొదలవగానే నేను ఉన్నచోటనే కూర్చున్నాను. నా చుట్టూ తుళ్లూరు మహిళలు రక్షణ కవచంలా నిలుచున్నారు. కానీ పోలీసులు అందరినీ లాగేశారన్నారు. వైద్య సదుపాయం కోరినా పట్టించుకోలేదని గల్లా జయదేవ్ మండిపడ్డారు. ఇంతలోనే ఎస్పీ విజయరావు నావైపు లాఠీతో దూసుకురావడంతో భయమేసింది. అయితే ఆయన నా వద్దకు వచ్చి లాఠీ పక్కనే ఉన్న పోలీసుకు ఇచ్చేశారు. నేను కూడా మౌనంగా ఉన్నాను. ఇంతలో ఆయన నాకు నమస్కారం పెడితే నేను ఆయనకు నమస్కారం పెట్టాను. ఇక్కడ మీరు ఉండకూడదు అంటూ నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నాతో పాటు కొందరు నేతలు కూడా వస్తామంటే వారిని కూడా జీపెక్కించారు. మూడు గంటలపాటు అక్కడా ఇక్కడా తిప్పి చివరికి నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇక తనను 12 గంటలపాటు తిప్పి నానా ఇబ్బందులు పెట్టారని గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
galla jayadev, mp , guntur, tulluru women, lotty charge , police cases , harrasment , police attack , guntur sub jail, bail
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article