తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాప్తి వాస్తవాలను దాచి పెట్టింది

41
Mp Komati reddy Venkat reddy hard comments on Ts Goverment
Mp Komati reddy Venkat reddy hard comments on Ts Goverment

Mp Komati reddy Venkat reddy hard comments on Ts Goverment

మార్చినెల నుంచి జూలై వరకు కోవిడ్ టెస్టుల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం వెల్లడి చేయలేదని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లోక్ సభలో గళమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న వివరాలకు జిల్లాల నుంచి వస్తున్న కేసుల వివరాలకు సరిపోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు పలుమార్లు చివాట్లు పెట్టిన నిర్లక్ష్యంగా ఉందన్నారు.

సెప్టెంబర్ మొదటి వారంలో కొత్తగా 1000 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయినప్పటికీ, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, గజ్వేల్, అదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో కోవిడ్ ఆసుపత్రి లో ఒక్క బెడ్ కూడా భర్తీ కాకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని మండిపడ్డారు. కోవిడ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఒక జుడీషల్ ఎంక్వయిరీ కూడా జరిపించాలని కోరారు.

సెప్టెంబర్ 5 నుండి రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉన్నప్పటికీ, ప్రతి రోజు మరణాల సంఖ్య 8 మరియు 10 మధ్య ఉన్నట్లు చూపబడింది. ఇదే విషయం కోర్టు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒక వార్తా పత్రిక సర్వే ప్రకారం సెప్టెంబరు 1 నాటికి, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నగరంలో మొత్తం 43,034 కేసులు ఉన్నాయని చెప్పితే, రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మీడియా బులెటిన్ ప్రకారం, తెలంగాణలో మొత్తం 32,341 క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. కరోనా సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులలో అధిక ఫిజులు వసూలు చేస్తున్న చర్యలు లేవు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లాగించిన  38 ప్రైవేట్ ఆస్పత్రులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వంపై ప్రజల నమ్మకం పూర్తిగా కుప్పకూలిందని వెంకట్ రెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here