టీడీపీకి అమలాపురం ఎంపీ గుడ్ బై

MP PANDULA QUIT TDP

  • వైఎస్సార్ సీపీలో చేరనున్న పండుల రవీంద్రబాబు
  • ఈసారి అసెంబ్లీ బరిలో దిగే అవకాశం

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఇటీవలే వైఎస్సార్ సీపీలో చేరిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తో కలిసి సోమవారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్సార్ సీపీ అధినేత జగన్ తో ఆయన సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి అమలాపురం లోక్ సభ స్థానానికి పోటీచేసి విజయం సాధించిన రవీంద్రబాబు.. కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఈసారి అమలాపురం ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానం ఆసక్తి చూపకపోవడం ఆయనలో అసంతృప్తికి కారణమైంది. ఈ నేపథ్యంలో పండుల రవీంద్రబాబు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టంచేసిన ఆయన.. తాజాగా మనసు మార్చుకున్నారు. వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేయాలని భావిస్తున్నారు. ఆయనకు గోదావరి జిల్లాల్లో ఏదైనా ఎస్సీ రిజర్వ్ డు స్థానం కేటాయించే అవకాశాలున్నాయి.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article