ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్‌

93

ఆంధ్రప్రదేశ్​ లో ని నర్సాపురం లోకసభ ఎంపీ రఘురామ కృష్ణరాజు (ఆర్ ఆర్ ఆర్ ) బుధవారం సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ పోలీసులు రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసి గుంటూరు తరలించిన సంగతి తెలిసిందే రఘురామరాజుకు బెయిల్ మంజూరు చేస్తూ ఈనెల 21న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 24న ఆయన తరఫున న్యాయవాదులు. గుంటూరు సీఐడీ కోర్టులో పూచీకత్తు సమర్పించారు.ఈ సందర్భంగా రఘురామరాజు ఆరోగ్య పరిస్థితిపై మెజిస్ట్రేట్ ఆరా తీశారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి పూర్తి వివరాలతో డిశ్చార్జ్ సమ్మరీని ఇవ్వాలని సూచించారు. దీంతో ఆర్మీ ఆసుపత్రి వర్గాలుడిశ్చార్జ్‌ సమ్మరి ఇవ్వడంతో న్యాయవాదులు దాన్ని గుంటూరు సీఐడీ కోర్టుకు అందజేశారు దీంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అక్కడి నుంచి బేగంపేట ఎయిర్​పోర్ట్ చేరుకున్న రఘరామ ప్రత్యేక విమానంలో నేరుగా దిల్లీకి బయలుదేరి వెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here