కేటీఆర్ ఫాం హౌస్  వివాదంలో రేవంత్ అరెస్ట్ 

204
63 CASES AGAINST REVANTH
63 CASES AGAINST REVANTH
MP Revanth Reddy arrested for drone shoot on KTR farmhouse
కేటీఆర్ ఫాం హౌస్ వివాదంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు . తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఇటీవల తెలంగాణా మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు అయిన  కేటీఆర్ ఫాంహౌస్ పై నిబంధనలకు విరుద్ధంగా  డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరణ  చేశారని రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రేవంత్ రెడ్డితోపాటు మరో ఐదుగురుని కూడా అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. లోక్ సభ సమావేశాలకు హాజరై ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కేటీఆర్ ఫామ్‌హౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించారని రేవంత్‌పై అభియోగం, ఇప్పటికే నలుగురు రేవంత్‌రెడ్డి అనుచరులను అరెస్ట్‌ చేశారు. రేవంత్ సహా 8 మందిపై నార్సింగ్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ 184, 187, 11 రెడ్ విత్ 5ఏ, ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదయ్యాయి.ఇప్పటి వరకు రేవంత్ రెడ్డితోపాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పరపల్లి న్యాయస్థానానికి తరలించారు. దీంతో ఈ వ్యవహారంపై దుమారం రేగింది.

MP Revanth Reddy arrested for drone shoot on KTR farmhouse,ktr farm house , revanth reddy , congress mp, delhi, shamshabad air port , case , arrest , drone camera, rules voilation

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here