ఆ పోలీసులను విడిచిపెట్టేది లేదన్న సంజయ్

MP SANJAY WARNS POLICE

ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమ యాత్ర సందర్భంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై జరిగిన దాడి తెలంగాణా రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతుంది. తనపై  దాడి చేసిన పోలీసులను వదిలిపెట్టేది లేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతి యుతంగా పాదయాత్ర చేస్తున్న తనను అడ్డుకోవడమే కాకుండా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆయన మండి పడుతున్నారు.టీఎస్‌ఆర్‌టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు ఉదయం కరీంనగర్‌లో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ర్యాలీ లో మాట్లాడిన బండి సంజయ్ నిన్న జరిగిన దాడి పై స్పందించారు.బాబు అంతిమ యాత్ర సందర్భంగా ఒక ఎంపీ అన్న మర్యాద కూడా లేకుండా, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తనపై పోలీసులు ప్రవర్తించిన తీరు అప్రజాస్వామిక మన్నారు. పార్లమెంట్ వేదికగా చర్చ పెడతానని, తెలంగాణ పోలీసులను వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. దౌర్జన్యం చేసిన తెలంగాణ పోలీసు అధికారులపై పార్లమెంటులో ప్రివిలేజ్‌ మోషన్‌ పెట్టనున్నట్లు బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఇదంతా చూస్తున్నా డీజీపీ సదరు పోలీసులపై చర్య తీసుకోలేదని మండిపడ్డారు. తనపై దాడి చేసి, తన కాలర్ పట్టుకున్న పోలీసులను విడిచిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు.

TS POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article