సొంతపార్టీ ఎంపీ బీజేపీలోకి జంప్

Mamata Banerjee MP’S joining in BJP

మమతా బెనర్జీ… దేశ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని వ్యక్తి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి. ప్రస్తుతం బీజేపీపై భగ్గుమంటున్న నేత. బీజేపీయేతర కూటమి తో వచ్చే ఎన్నికల్లో బీజేపీని మట్టి కనిపించాలని ప్రయత్నం చేస్తున్న నేత. అలాంటి మమతా బెనర్జీకి సొంత పార్టీ నేత షాక్ ఇచ్చాడు. ఓ ఎంపీ ఏకంగా మమత పరమ శత్రువులా భావించే బిజెపి తీర్థం తీసుకున్నాడు. అంతేకాదు తనలాగా పార్టీని వీడి వచ్చేవారు మరో నలుగురైదుగురు ఉంటారని ఝలక్ ఇచ్చి మరీ వెళ్ళాడు.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న మమతా బెనర్జీకి షాక్ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుమిత్ర ఖాన్ రాజీనామా చేసి బిజెపిలో చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీపై సమర శంఖం పూరించాలి అనుకున్న మమతకు ఊహించని పరిణామం ఎదురైంది.
దేశంలో బిజెపి అవినీతి పాలనను అంతమొందించడానికి బీజేపీయేతర కూటమి ద్వారా మమతా బెనర్జీ ప్రయత్నం ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ తో కూడా కలిసి పనిచేయడానికి మొదటినుంచి మమతకు అభ్యంతరం ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మమత ఉండాలని భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్తో కలిసి ఏర్పాటైన బీజేపీయేతర కూటమి ని మమత వ్యతిరేకించింది. ఒకపక్క స్టాలిన్ బీజేపీయేతర కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అని ప్రకటించడంతో మమతా ఈ అభ్యంతరాన్ని తెలియజేసింది. ప్రధాని అభ్యర్థిగా మమత రేసులో ఉన్నట్టు ఆ పార్టీ ముఖ్య నేతలు ప్రకటించడంతో మమత ఆలోచన అందరికీ అర్థమైంది. ఇక ఈ నేపథ్యంలో ఆమె బీజేపీయేతర కూటమి కి బదులుగా తానే స్వయంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలని భావించింది.ఇదే తరుణంలో కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో భాగం కావాలని మమతను కోరారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమిలో మమత చేరాలని కెసిఆర్ ప్రయత్నం చేశారు. మొదటి నుంచి కేసీఆర్ అభిప్రాయాలతో ఏకీభవించని మమతా బెనర్జీ అవసరమైతే కానీ ఒక కూటమి ద్వారా ఎన్నికలకు వెళ్తానని నిర్ణయించుకున్నారు.

అసలు విషయం అర్థం చేసుకున్న చంద్రబాబు బీజేపీయేతర కూటమి ప్రధాని అభ్యర్థి నిర్ణయం ఇంకా జరగలేదని ఎన్నికల అనంతరమే అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని చెప్పి మమతను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇక ఈ నెల 18న కోల్ కత్తా లో జరగబోవు ర్యాలీ ద్వారా ప్రాంతీయపార్టీల సత్తాను బిజెపికి చూపించాలని భావించిన మమతకు సొంత పార్టీ నేత షాక్ ఇచ్చారు. ఆ పార్టీ ఎంపీ సుమిత్ర ఖాన్ రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఇక ఆయన బాటలో మరో నలుగురైదుగురు ఎంపీలు కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది .బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను, నరేంద్ర మోడీని కలిసిన వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఇక దీనికి కారణం లేకపోలేదు. పార్టీని వీడడానికి ముందు ఆయన చేసిన ఒక నిర్వా కం వల్ల పార్టీ అధిష్టానం ఆయనను మందలించింది. తనను ఒక పోలీస్ అధికారి చంపాలనుకుంటున్నారు అని సుమిత్ర ఖాన్ ఫేస్బుక్ లో చేసిన పోస్ట్ పై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు తన ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి ప్రభుత్వ పరువును, పార్టీ పరువును రోడ్డున పెడతారని ఆగ్రహించడం తోనే సుమిత్ర ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇది మమతకు ఇబ్బంది కలిగించే పరిణామమే. మొత్తానికి బిజెపికి వణుకు పుట్టించే లా కోల్ కత్తాలో ర్యాలీ నిర్వహించాలని ఏర్పాట్లు చేసుకుంటున్న మమతా బెనర్జీకి ఓ ఎంపీ రాజీనామా చేయడం బిజెపిలో చేరడం నిజంగా పెద్ద షాకే.v

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article