జనవరి 6న ‘మిస్టర్ మజ్ను’ సాంగ్

Jan 6th “MR Majnu” movie songs release AkhilAkkinen,NidhhiAgerwal

జనవరి 6న ‘మిస్టర్ మజ్ను’ సాంగ్ హార్ట్ బ్రేక్ సాంగ్ “నాలో నీకు నీలో నాకు…“ రిలీజ్
అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న  ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ‘ఏమైనదో.. ఏమైనదో.. పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’, టైటిల్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా, ఈ చిత్రంలోని హార్ట్ బ్రేక్ సాంగ్ 
“నాలో నీకు.. నీలో నాకు ఇక సెల‌వేనా…
ప్రేమ కానీ ప్రేమ వ‌దులుకుంటున్నా…“ను విడుదల చేస్తున్నారు.
అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article