Ms Dhoni ready to IPL
నేటి నుంచి ఐపీఎల్ మొదలు కానుంది. ఐపీఎల్ అంటేనే పరుగుల వరద. అభిమానుల కళ్లనీ హిట్టర్స్ పై పడతాయి. కానీ ఈ ఐపీఎల్ లో మాత్రం అన్ని జట్ల అభిమానులు మాత్రం ధోని వైపు చూస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం, సుదీర్ఘ విరామం తర్వాత ఫీల్డ్ లో అడుగు పెడుతుండటమే ఇందుకు కారణం. నేటి ఐపీఎల్ పోరులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తో తలపడనుంది.
ధోని కెప్టెన్సీలో ఇప్పటికే మూడు టైటిల్స్ ఉన్నాయి. ఎనిమిది సార్లు జట్టు ఫైనల్స్ కు చేర్చాడు. అయితే ఈసారి ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడటం, రైనా, హర్భజన్ లాంటి ఆటగాళ్లు జట్టుకు దూరం కావడం బాధిస్తోంది. ఈ సమస్యలను మిస్టర్ కూల్ ఎలా అధిగమిస్తాడోనని అభిమానులు వెయిట్ చూస్తున్నారు. చెన్నై జట్టుకు ఎంతో అనుభవం ఉందని, ధోని కూడా తన అనుభవంతో మ్యాచ్ లు నెగ్గుతాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ధోనీ ఎలా ఆడతాడనేది త్వరలో తేలనుంది.