జోహార్ ఎమ్మెస్సార్..

Congress Senior Leader, PCC Ex President, M Satyanarayana Expired Today Morning in Nims Hospital. He was in coma since few days.

112
MSR IS NO MORE
MSR IS NO MORE

కాంగ్రెస్ నాయకుడు ఎం సత్యనారాయణ (ఎంఎస్సార్) మంగళవారం ఉదయం 3.45 గం.లకు నిమ్స్ లో మరణించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన ఎంఎస్సార్ కు భార్య, ఇద్దరు కుమారులు, కూతుర్లు ఉన్నారు. నిన్న సాయంత్రమే ఆయన చనిపోయినట్లుగా వార్తలు వినిపించడంతో ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. ప్రస్తుతం ఐసీయూ లో చికిత్స పొందుతున్నారని.. గత కొంత కాలం ఆరోగ్యం బాగోలేక.. కోమాలో ఉంటున్నారని వెల్లడించారు. కాకపోతే పరిస్థితి విషమంగా ఉందని డాక్లర్లు చెప్పారు. కాకపోతే, ఆయన ఈ రోజు ఉదయం మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. దివంగత ఎమ్మెస్సార్ అంత్యక్రియలను అధికారిక లాంచనలతో నిర్వహించాల్సిందిగా… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఆయన సిసలైన కాంగ్రెస్ వాది. తాను నమ్ముకున్న పార్టీకి వెన్నుపోటు పొడవలేదు. తనను పెంచి పోషించిన పార్టీని నట్టేట్లో ముంచి ఇతర పార్టీల్లో చేరలేదు. జోహార్ ఎంఎస్సార్ అని సగటు కాంగ్రెస్ వాదులు భావిస్తున్నారు.

పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,మేనేని సత్యనారాయణ రావు (ఎం ఎస్ ఆర్) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదిగా, ఎంపీ గా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెస్సార్ ప్రత్యేక శైలి కనబరిచారని, రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారని, సీఎం గుర్తు చేసుకున్నారు. దివంగత ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి ని తెలిపారు. ఎం ఎస్ ఆర్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సభాపతి గారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here