టీడీపీలో చేర‌నున్న ముద్ర‌గ‌డ‌?

MUDRAGADA MAY JOIN TDP

ఏపీలో ఎన్నికలు సమయం దగ్గర పడుతుంది. ఎన్నికల్లో కీలక భూమిక పోషించటం కోసం కాపు ఉద్యమనేత గా గుర్తించబడిన ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాలకు సిద్ధమవుతున్నారా? ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో నిలబడుతున్నారా ? ఏ నియోజకవర్గం నుండి ఆయన బరిలోకి దిగాలనుకుంటున్నారు? ఇక ఏ పార్టీ నుండి ఆయన వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్నారు అనే చర్చ ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొంది.

అయితే ప్రస్తుతం ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభంది ప్రత్యేక స్థానం. కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ.. రాజకీయంగా ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నేతల్లో ఆయన ఒకరు. ఆయన తండ్రి ముద్రగడ వీరరాఘవులు.. రెండుసార్లు ప్రత్తిపాడు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన వారసుడిగా 1978లో ముద్రగడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా కాంగ్రెస్, టీడీపీ త‌రుపున‌ ప‌లుమార్లు గెలుస్తూ వ‌చ్చిన ముద్రగడ.. ఎన్టీఆర్ హ‌యాంలో కీల‌క పాత్ర పోషించారు. మంత్రిగా కీల‌క శాఖ‌లు నిర్వహించి రాజ‌కీయంగా ఎదిగారు. ఆ త‌రవాత కొన్నాళ్లకే ఎన్టీఆర్‌తో విబేధించి అప్పట్లో జానారెడ్డి, కేఈ కృష్ణ‌మూర్తి వంటి వారితో క‌లిసి సొంతంగా తెలుగుత‌ల్లి పార్టీని కూడా స్థాపించారు. కానీ అది ఫ‌లించ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ బీజేపీ పంచ‌న చేరి .. కాకినాడ పార్లమెంట్ సీటు నుంచి విజ‌యం సాధించారు. గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లో ముద్రగడ పిఠాపురం, ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానాల నుంచి వ‌రుస‌గా ఓట‌మి పాల‌య్యారు. అయిన‌ప్పటికీ కాపు ఉద్యమంతో ఆయ‌న నిత్యం వార్తల్లో నేత‌గా నిలిచారు.

* వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రత్యక్ష రాజకీయాల ద్వారా కీలకపాత్ర పోషించాలని నిర్ణయించుకున్న ఆయన జనవరి 31న కీల‌క స‌మావేశం నిర్వహించబోతున్నారు.  ఇక కాపు ఉద్యమనేత తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారు అన్న టాక్ ప్రస్తుతం వినిపిస్తోంది. టిడిపి నుండి ఒక కీలక మంత్రి పలు దఫాలుగా ఆయనతో చర్చలు జరపగా టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాపు నేత వంగవీటి రాధాకృష్ణ టిడిపి వైపు సుముఖంగా ఉంటే తాజాగా ముద్రగడ కూడా బాబు నాయకత్వంపై నమ్మకంతో టిడిపి వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో వంగవీటి మోహన రంగా తనయుడు రాధాకృష్ణ టిడిపిలో చేరుతారని ఇప్పటికే ఏపీలో చర్చ జరుగుతుంటే తాజాగా ముద్రగడ పద్మనాభం సైతం టిడిపి బాట పట్టారని చర్చించుకుంటున్నారు. ఇక కాపు రిజర్వేషన్ల విషయంలో మొదటి నుండి కాపుల రిజర్వేషన్ ఎవరైతే ఇస్తారు కాపు సంక్షేమం కోసం ఎవరైతే పని చేస్తారో వారి వైపు తానుంటానని ముద్రగడ పద్మనాభం చెప్పిన పరిస్థితి.

* ఏపీలో కాపు రిజర్వేషన్ అంశం ఎప్పటి నుండో నలుగుతున్న 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాపు రిజర్వేషన్ హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాపు రిజర్వేషన్ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసినా దాని పై నీలినీడలు అలుముకున్నాయి. అయితే చంద్రబాబు కాపు కార్పొరేషన్ ద్వారా కాపు నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు చేయూతనిచ్చారు. అంతేకాకుండా కేంద్రం తెచ్చిన 10 శాతం ఈ బీసీ రిజర్వేషన్ల కూడా ఐదు శాతం కాపులకు ఇస్తానని ప్రకటించారు. కాపు సంక్షేమం కోసం చంద్రబాబు పనిచేస్తున్న నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం టీడీపీలో చేరడానికి ముగ్గు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ముద్రగడ ను టిడిపిలో చేర్చడానికి హోం శాఖ మంత్రి చినరాజప్ప శతవిధాల ప్రయత్నం చేస్తున్నారట. కాపు రిజర్వేషన్ అంశంపై జగన్ విముఖత వ్యక్తం చేయడం, చంద్రబాబు సానుకూలంగా స్పందించడం, కాపు నాయకులు చంద్రబాబుకు అండగా నిలవడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి కాపు ఓటు బ్యాంకును కొల్లగొట్టే ఆలోచనలో ఉంది టీడీపి. ఏపీలో అధికారంలోకి రావడానికి ఓటు బ్యాంకును శాసించే బలమైన సామాజిక వర్గం కాపు వర్గం కావడంతో ఈ తరహా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు. అంతేకాదు కాపు సామాజికవర్గ నాయకుడిగా పార్టీ పెట్టిన జనసేనని పవన్ కళ్యాణ్ నుండి టిడిపి ఓటుబ్యాంకును తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు కాపు నాయకులను పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు ఇక మొత్తానికి ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే 14 రాజకీయ పార్టీల సమావేశ వేదికపై, జాతీయ నాయకుల సమక్షంలో ముద్రగడ టిడిపి కండువా కప్పుకుంటారు అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

KAPU RESERVATIONS LATEST NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article