సీఎం జగన్ తో ముఖేష్‌ భేటీ…

Mukesh Ambani meets AP CM Jaganmohan Reddy

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్‌ అంబానీ భేటీ అయ్యారు. శనివారం ముంబైనుంచి కుమారుడు అనంత్ అంబానీతో కలిసి నేరుగా గన్నవరం వచ్చిన ఆయన తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నేడు సీఎం జగన్ తో  సమావేశం జరిగింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై సీఎం జగన్‌తో ముకేష్‌ చర్చించినట్లు తెలుస్తోంది. ఒకపక్క రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలను ఇస్తామని చెప్పిన సీఎం జగన్ పారిశ్రామిక ప్రగతి సాధించాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో ముఖేష్ అంబానీ సీఎం జగన్ తో భేటీ కావటం ఆసక్తికర అంశంగా మారింది. ఈ  సమావేశంలో అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమళ్‌నత్వానీ పాల్గొన్నారు.  రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై చర్చించినట్టు తెలుస్తోంది. జగన్‌ను కలిసిన వారిలో అంబానీతో పాటు రాజ్యసభ సభ్యుడు పరిమల్‌ నత్వాని, విజయసాయిరెడ్డి ఉన్నారు. వాస్తవానికి ఇవాళ్టి సీఎం అధికారిక షెడ్యూల్‌లో ముఖేష్‌ అపాయింట్‌మెంట్‌ లేకపోవడం విశేషం.

Mukesh Ambani meets AP CM Jaganmohan Reddy,cm jagan , mukhesh ambani , reliance industries , tadepalli, meet , andhrapradesh

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article