MUNICIPAL ELECTIONS TRS VS BJP
ముందస్తు ఎన్నికలకు వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచిన కేసీఆర్ ఆ ఎన్నికల్లో అనూహ్యంగా విజయాన్ని సాధించి అత్యధిక స్థానాల్ని సొంతం చేసుకుని తెలంగాణలో టీఆర్ఎస్ ను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిపారు. ఈ ప్యూహం అర్థం కాని కాంగ్రెస్ నేతలు మూర్ఖంగా కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని విమర్శలు గుప్పించారు. అయితే ఫలితాలు ఊహించని స్థాయిలో రావడంతో షాక్‌కు గురయ్యారు. ఆ తరువాత దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గాలి వీచింది. దీంతో కేసీఆర్ ముందస్తుకు వెళ్లడమే మంచిదైందని అంతా అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభావం పెరుగుతోందని, అది తనకు చేటుగా మారే ప్రమాదం వుందని గమనించిన కేసీఆర్ తెలివిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అనూహ్యంగా విజయాన్ని సాధించి మరో సారి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు.
Puri Jagan ISMARTSHANKAR
అయితే ఇదే ఫార్ములాని మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ అనుసరించబోతున్నట్టుతెలుస్తోంది. 2015లో జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఊహించని స్థాయిలో 99 స్థానాల్ని సాధించి ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. ఈ విజయంతో నగరంలో తన ప్రాబల్యాన్ని పెంచేసుకుంది. త్వరలో జీహెచ్ ఎంసీ ఎన్నికల నోటీఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో మళ్లీ తన పట్టును నిలుపుకోవడం కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించినట్టుగానే పురపాలక ఎన్నికల్లోనూ ముందస్తుకు వెళ్లాలనే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ వున్నట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే తెలంగాణలో పట్టు సాధించాలని, దానికి మున్సిపల్ ఎన్నికల్ని వేదికగా చేసుకోవాలని బీజేపీ ప్యూహాలు రచిస్తోంది. ఈ గేమ్‌లో కేసీఆర్ పంతం ఎంత వరకు నెరవేరుతుందో..బీజేపీ గేమ్ ప్లాన్ ఎలాంటి మలుపులకు శ్రీకారం చుడుతుందో చూడాలి.