అనుమానపు పెనుభూతం ఓ వ్యక్తి హత్యాయత్నానికి దారితీసింది

మునగాల మండలం రేపాల గ్రామంలో అక్రమ సంబంధం అనే అనుమానపు పెనుభూతం ఓ వ్యక్తి హత్యాయత్నానికి దారితీసింది.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…రేపాల గ్రామానికి చెందిన బొమ్మల వెంకటనర్సు పెద్ద కుమారుడైన బొమ్మల శివ(22) మరియు వాసిమేకల వెంకయ్య కుమారుడు రామకృష్ణ(30) మధ్య
గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.వాసిమేకల రామకృష్ణ భార్యకు బొమ్మల శివకు మధ్య అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో రామకృష్ణ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో రామకృష్ణ భార్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది.తన కాపురంలో గొడవలకు కారణం బొమ్మల శివ అని కక్ష పెంచుకున్న రామకృష్ణ తరుచూ బొమ్మల శివపై గొడవకు దిగేవాడు. ఈ విషయమై గతంలో పెద్ద మనుషులు సమక్షంలో పంచాయతీ కూడా జరిగినట్లు సమాచారం.ఇదే విషయాన్ని మనసులో పెట్టుకొన్న రామకృష్ణ శనివారం బొమ్మల శివ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పథకం ప్రకారం అతనిని హతమార్చాలనే ఉద్దేశ్యంతో అతని ఇంట్లోకి ప్రవేశించి అతనికి హానికరమైన ఇంజక్షన్ చేయడంతో శివ అక్కడికక్కడే కిందపడిపోయి కోట్టుకొంటుండగా గమననించిన స్థానికులు అతనిని వెంటనే 108 అంబులెన్స్ సాయంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు.బొమ్మల శివ యొక్క తండ్రి వెంకటనర్సు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల ఎస్ఐ బాలు నాయక్ తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article