ప్రేమించలేదని యువతిని కత్తితో పొడిచిన ఉన్మాది  

murder attempt with knife
తనను ప్రేమించాలని ఒక యువతిని వేధింపులకు గురి చేసిన వ్యక్తి,  చివరకు నిరాకరించిందని కత్తితో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు.  పట్టపగలు బస్టాండ్ లో అందరూ చూస్తుండగానే యువతిపై కత్తితో దాడి చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో దారుణం జరిగింది. సుధాకర్ అనే వ్యక్తి.. తేజశ్రీ(20) అనే యువతిని కత్తితో పొడిచాడు.. అనంతరం అతను కూడా. పురుగుల మందు తాగాడు. దీంతో.. వీరిద్దరినీ.. స్థానికులు పాలకొల్లు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి కూడా. విషమంగా ఉంది. తేజశ్రీ ప్రస్తుతం ఎంఎస్సీ చదువుతోంది. రోజూలాగే.. ఈ రోజు కూడా కాలేజీకి బయలుదేరింది. తనను కొద్ది రోజులుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధిస్తున్నాడు సుధాకర్. ఆమె ప్రేమకి నిరాకరించడంతో.. చివరికి కత్తితో దాడి చేశాడు. సుధాకర్‌కి ముందే పెళ్లి అయి  భార్యతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యాడు.  ఇక తాజాగా  తేజశ్రీ వెంటపడి ఆమె నిరాకరించడంతో ఆమె ప్రాణాలను బలి తీసుకోవాలని ప్రయత్నించాడు.  దీని పై  పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

tags : West Godavari, kavitam, young woman, love rejection, murder attempt, knife, sudhakar

శిశువు మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్కలు

కోర్టు ఆదేశాలతో  ఈడీ చిదంబరం విచారణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *