ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలి

Madras High Court Chief Justice Sanjib Banerjee Sensational Comments on Election Commission Of India. He Opined that, Must file a murder case against Election Commission For allowing Political Rallies during Corona Second Wave Pandemic

219
Sanjib Banerjee
Sanjib Banerjee

మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

పొలిటికల్ ర్యాలీల సమయాల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడటంలో విఫలమై ప్రస్తుత కరోనా సంక్షోభానికి కారణమైన భారత ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలని మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా కల్లోలం సమయంలో పొలిటికల్ ర్యాలీలను అనుమతిస్తున్నందుకు భారత ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితికి ఎన్నికల సంఘమే కారణమంటూ చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘కోర్టులు పలుమార్లు ఆదేశాలు ఇస్తున్నాయి. అయినా పొలిటికల్ ర్యాలీలు తీస్తున్న రాజకీయ పార్టీలపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మీ ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలి’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. కోర్టులు పలుమార్లు ఆదేశించినప్పటికీ ఎన్నికల ప్రచార సమయంలో కొవిడ్ నిబంధనలు అమలు చేయడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్న విషయం చీఫ్ జస్టిస్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరేమైనా వేరే గ్రహం మీద ఉన్నారా.. ఎందుకు చర్యలు తీసుకోలేదు.. అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్ల లెక్కింపు రోజు కొవిడ్-19 ప్రోటోకాల్స్ అమలు చేసేందుకు తీసుకోబోయే చర్యలతో కూడిన యాక్షన్ ప్లాన్ బ్లూ ప్రింట్‌ను సమర్పించక పోతే మే2న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను రద్దుచేస్తామని ఎన్నికల సంఘాన్ని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here