Must Hang This Father
మానవ సంబంధాలు రోజురోజుకూ మృగ్యమై పోతున్నాయి. కన్న తండ్రే కాల యముడులా కామంతో కాటు వేస్తున్న సంఘటనలు రోజురోజుకు సమాజంలో పెరిగిపోతున్నాయి. విచక్షణ మరచి పశువుల ప్రవర్తిస్తున్న మగాళ్ళ అరాచకాలకు సాక్షి భూతంగా నిలుస్తున్నాయి కొన్ని సంఘటనలు. చూడాల్సిన తండ్రి, అండగా ఉండాల్సిన తండ్రి ఆ పని చేయాలని వేధిస్తుంటే దిక్కుతోచని స్థితిలో విలవిలలాడిన ఒక యువతి నిలువున ప్రాణాలు తీసుకుంది.
ఇంజనీరింగ్ చదివే కన్న కూతురు స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీసి లైంగికంగా వేధింపులకు గురి చేసి ఆమె ఆత్మహత్యకు కారణం అయ్యాడు ఓ కసాయి తండ్రి. ఇక ఆ రాక్షసుడికి న్యాయస్థానం 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విదించింది. కామాంధుడిని అతని భార్య పోలీసులకు పట్టించింది. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిక్కబళ్లాపురంలో నివాసం ఉ:టున్న పాండురంగ (54) అనే కామాంధుడు జైలుకు వెళ్లాడు. పాండురంగకు ఇంజనీరింగ్ చదివవే కుమార్తె ఉండేది. కుమార్తె స్నానం చేస్తున్న సమయంలో పాండురంగ రహస్యంగా చాలసార్లు వీడియోలు తీశాడు. లైంగిక కోరిక తీర్చాలని టార్చర్ నగ్నంగా ఉన్న వీడియోలు కుమార్తెకు చూపించిన పాండురంగ తన లైంగిక కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేశాడు. తండ్రి పెడుతున్న లైంగిక చిత్రహింసలకు ఆమె తట్టుకోలేకపోయింది. ఇంజనీరింగ్ కాలేజ్ లో తనతోపాటు చదువుతున్న ఓ అమ్మాయికి విషయం చెప్పి విలపించింది. ఇంటిలో నిత్యం తండ్రి లైంగిక వేధింపులు తట్టుకోలేని యువతి 2013 నవంబర్ 28వ తేదీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, పోలీసులు భావించారు. నెల తరువాత పాండురంగ భార్యకు యువతి స్నేహితురాలు అసలు విషయం చెప్పింది. తన భర్త పాండురంగ వేధింపుల కారణంగా తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి చిక్కబళ్లాపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పాండురంగ మొబైల్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా కుమార్తె స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు వెలుగు చూశాయి. యువతిని ఆమె తండ్రి పాండురంగ లైంగిక వేధింపులకు గురి చెయ్యడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు న్యాయస్థానంలో నివేదిక, మొబైలో ఉన్న వీడియోలు, సాక్షాలు సమర్పించారు. ఆరు సంవత్సరాలు విచారణ చేసిన న్యాయస్థానం కామాంధుడు పాండురంగ నేరం చేశాడని రుజువు కావడంతో 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 10,000 జరిమానా విధించింది.
tags: Deadly Father, Dangerous Father, bath videos, sexual harassment, suicide, jail, Bengaluru,