క‌రోనా యోధుల‌ను స్మ‌రించుకోవ‌డం బాధ్య‌త

52
'Pylon’ to mark the 1st National Covid-19 Memorial Day unveiled at KIMS Hospitals
'Pylon’ to mark the 1st National Covid-19 Memorial Day unveiled at KIMS Hospitals

Must Remember Corona Warriors

కిమ్స్ ఎండీ భాస్క‌ర్‌రావు

రోనా వైరస్ మహమ్మారిపై పోరులో ముందువ‌రుస‌లో నిలిచి ప్రాణాలు కోల్పోయిన డాక్ట‌ర్లు, ఆరోగ్య‌సిబ్బందికి,  దేశంలోనే ప్ర‌ముఖ ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (కిమ్స్‌) ఆస్ప‌త్రుల‌లో మంగ‌ళ‌వారం ఘ‌న నివాళుల‌ర్పించారు. కోవిడ్‌-19 ప్ర‌థ‌మ సంస్మ‌ర‌ణ దినోత్స‌వాన్ని పురస్క‌రించుకుని  వీరుల సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. కిమ్స్ ఆస్ప‌త్రుల‌ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి. భాస్కర్ రావు అధ్యక్షతన జ‌రిగిన ఈ కార్యక్రమంలో  “కోవిడ్-19 మ‌హ‌మ్మారిపై జరిగిన పోరాటంలో విధి నిర్వహణలో తమ జీవితాలను అర్పించిన కోవిడ్ -19 యోధులందరి జ్ఞాపకార్థం” అనే పదాలతో కూడిన పైలాన్ ను ఎండీ  ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ -19 వైరస్‌తో జ‌రిగిన పోరాటంలో ముందువ‌ర‌స‌లో నిలిచిన‌ వివిధ విభాగాల అధిపతులు  పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా కిమ్స్ ఆస్పత్రుల ఎండీ భాస్క‌ర్‌రావు మాట్లాడుతూ..  “క‌రోనా మ‌హ‌మ్మారిపై జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలు సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. కోవిడ్‌-19 ర‌క్క‌సిపై పోరాటంలో అలుపెర‌గ‌క పోరాడిన  వారంద‌రికీ  కృతజ్ఞతలు. కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కేవలం ఆస్ప‌త్రుల చికిత్స యంత్రాల సామ‌ర్థ్యాలు, అధునాత‌న వైద్య‌స‌దుపాయాల‌ను ప‌రీక్షించ‌డ‌మే కాకుండా.. మ‌నుషుల మాన‌వ‌త్వ బంధాలు, ప‌రిధుల‌ను కూడా చెరిపేసింది. ఇటువంటి క‌నీవిని ఎరుగని సంక్షోభంలో  డాక్ట‌ర్లు, నర్సింగ్  మ‌రియు సహాయక సిబ్బంది మాత్రమే కాదు, క‌రోనాతో పోరాడ‌టానికి  ముందు వ‌రుస‌లో నిలబడి, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులతో సహా ప్రతి ఫ్రంట్ లైన్ వారియ‌ర్‌ వారి నిబద్ధతను ప్రదర్శించారు. రెండో వేవ్‌ ప్రమాదం ఉన్న‌ప్ప‌టికీ, ప్రజలు మ‌నోధైర్యం కోల్పోక‌పోవ‌డ‌మే అన్నింటికన్నా ముఖ్యమైనది. ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా టీకాలు వేసుకున్న‌ప్ప‌టికీ సామాజిక దూరం మరియు  మాస్కులు ధ‌రించ‌డం  జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం ”  అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా “కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ డిసీజెస్ డైరెక్టర్“ డాక్టర్ పి. రఘురామ్ మాట్లాడుతూ “మన జీవితకాలంలోనే  ఊహించ‌ని సంక్షోభంలో విధినిర్వ‌హ‌ణ‌లో భాగంగా డాక్ట‌ర్లు, నర్సింగ్ మ‌రియు సహాయక సిబ్బంది ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడ‌డానికి ఎంతో కృషి చేశారు. కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ బారిన ప‌డి పోరాడుతున్న వారంద‌రూ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

Telangana Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here