ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ పై రాళ్ళతో దాడి…

Muthoot finance company MD injured in attack in Kerala

కొచ్చిలో ముత్తూట్ ఫైనాన్స్  మేనేజింగ్ డైరెక్టర్ జార్జి అలెగ్జాండర్ పై దాడి జరిగింది. ఆయన కారులో వెళుతుండగా మధ్యలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో ఆయనపై దాడికి దిగారు. కారుపై పెద్ద రాళ్లు విసరడంతో ఆయనకు బలమైన గాయాలయ్యాయి. అసలు ఏం జరుగుతుందో ఎవరు దాడికి పాల్పడుతున్నారో అర్ధం కాని స్థితిలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు.  కారు ధ్వంసమైంది. మరో కారులో వచ్చిన సిబ్బంది తీవ్రంగా గాయపడ్డ జార్జి అలెగ్జాండర్ ను ఆసుపత్రికి తరలించారు. భారతదేశంలోనే  అతి పెద్ద గోల్డ్ ఫైనాన్సింగ్ సంస్థగా ముత్తూట్ ఫైనాన్స్ కు గుర్తింపు ఉంది. కొంతకాలంగా సంస్థ ఉద్యోగులకు, యాజమాన్యానికి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసనలు, ధర్నాలు చేపడుతుండడంతో కొందరు ఉద్యోగులపై ముత్తూట్ ఫైనాన్స్ వేటు వేసింది. తమ సంస్థ ఉద్యోగులు సీఐటీయూ కార్మిక సంఘంతో సఖ్యతగా ఉండడం కూడా ముత్తూట్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్ కు రుచించడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ ఎండీపై దాడి జరగడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇక ఈ వ్యవహారంలో పోలీసులు ఆయనపై దాడికి పాల్పడిన వారు ఎవరు అన్న దానిపై విచారణ కొనసాగిస్తున్నారు.
Muthoot finance company MD injured in attack in Kerala,muthoot finance corporation , managing director, george alegzander, attack, stones, car , employees , hospital, police case

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article