మా నాన్నకు కేన్సర్ వచ్చింది

MY Father was Effected with Cancer

  • బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వెల్లడి

బాలీవుడ్ ను కేన్సర్ మహమ్మారి వెంటాడుతోంది. ఇప్పటికే ఇర్ఫాన్ ఖాన్, సోనాలి బింద్రె సహా పలువురు ప్రముఖులు కేన్సర్ బారిన పడగా.. తాజాగా హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ కు కేన్సర్ వచ్చిన విషయం తెలిసి బాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయాన్ని హృతిక్ స్వయంగా వెల్లడించారు. తండ్రితో కలిసి జిమ్ లో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఈ షాకింగ్ అంశాన్ని తెలియజేశారు. తన తండ్రికి గొంతుకు సంబంధించిన కేన్సర్ సోకిందని, తొలి దశలో ఉన్న ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ‘ఈ ఉదయం ఓ ఫొటో తీసుకుందామని మా నాన్నను అడిగాను. ఎందుకంటే సర్జరీ రోజున ఆయన జిమ్ మిస్ కాకూడదు. నాకు తెలుసు.. ఆయన చాలా బలీయమైన వ్యక్తి. ఆయనకు గొంతు కేన్సర్ అని కొన్ని వారాల క్రితమే తెలిసింది. దాన్ని జయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు’ అని హృతిక్ ట్వీట్ చేశారు. హృతిక్ ను బాలీవుడ్ లో స్టార్ హీరో చేయడంలో రాకేష్ ఎన్నో త్యాగాలు చేశారు. ఆయనే నిర్మాత దర్శకుడిగా మారి తీసిన ‘క్రిష్’ సిరీస్ సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. దర్శకుడిగా, నిర్మాతగా ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ప్రస్తుతం హృతిక్‌ హీరోగా క్రిష్‌ 4, క్రిష్‌ 5 చిత్రాలను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కేన్సర్ వెలుగుచూసింది.

Previous article
Next article
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article