రామేశ్వరరావు ఎవరికి ఛాలెంజ్?

114
MYHOME RAMESHWARA RAO CHALLENGE
MYHOME RAMESHWARA RAO CHALLENGE

MyHome RameshwaraRao Challenge

సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ అండ్ ఐజీ టి. చిరంజీవులు చేసిన గ్రీన్ ఛాలెంజ్‌కు మైహోం గ్రూప్‌ సంస్థల చైర్మన్ డాక్టర్ జె.రామేశ్వరరావు స్పందించారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో మైహోమ్‌ గ్రూపు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మైహోమ్ భూజ ప్రాంగణంలో డాక్టర్ రామేశ్వరరావు బుధవారం మొక్కలు నాటారు. అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌ కుమార్‌కు, ప్రముఖ తెలుగు సినిమా డైరక్టర్ వంశీ పైడిపల్లికి, టీవీ9 డైరెక్టర్‌ సింగారావుకు గ్రీన్‌ ఛాలెంజ్ చేశారు. అయినా రామేశ్వరరావు తలుచుకుంటే ఈ చిన్న మొక్కలు నాటడమేంటి? పశ్చిమ హైదరాబాద్ మొత్తం పచ్చదనం చేయగల సమర్థుడు అని చాలామంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆయన అనుకుంటే భారీ స్థాయిలో మొక్కలు నాటగలరని, అసలు ఆయన ఒక్కడే హైదరాబాద్ మొత్తం పచ్చదనంతో నింపేయగల సామార్థ్యం గల వ్యక్తి అని అంటున్నారు. ఆయన ప్రస్తుతం వ్యక్తి కాదు.. తెలంగాణలోనే ఒక గొప్ప శక్తిగా అభివర్ణిస్తున్నారు. మరి, ప్రజలకు ఆయన పట్ల ఉన్న నమ్మకం ఏపాటిదో అర్థమవుతోంది. కాబట్టి, రామేశ్వరరావు ఇంకా మెరుగైన రీతిలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించాలని అధిక శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు.

MYHOME LATEST UPDATES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here