ప్రభాస్ సినిమాతో పెద్ద సర్ ప్రైజే ఇచ్చిన నాగ్ అశ్విన్

24

nag aswin surprised

ప్రభాస్ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. వరసగా భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ టైమ్ లోనే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అశ్వనీదత్ నిర్మించే సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తో ‘ఆదిపురుష్’అనౌన్స్ అయింది. నాగ్ అశ్విన్ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకోణ్ ను తీసుకున్నప్పుడే ఇది భారీ ప్యాన్ ఇండియన్ సినిమాగా రాబోతోందని తేలిపోయింది. అయితే రీసెంట్ గా నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన మరో బిగ్ న్యూస్ ను అనౌన్స్ చేస్తాం అని చెప్పాడు. చెప్పినట్టుగానే ఇవాళ(శుక్రవారం) కరెక్ట్ గా 10 గంటలకు ఈ ఈ మూవీలో మరో మెగాస్టార్ ను తీసుకున్నట్టు ప్రకటించాడు. యస్.. ఇండియాస్ బిగ్ స్టార్.. బిగ్ బి ప్రభాస్ మూవీలో ఓ కీలక పాత్ర చేయబోతున్నట్టుగా ప్రకటించింది అశ్వనీదత్ బ్యానర్.

దీనికి వెనక వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జగదేకవీరుడు అతిలోక సుందరిని తలపిచింది. ‘హౌ కెన్ వీ ట్రై టు మేక్ ఏ లెజెండరీ ఫిల్మ్ వితౌట్ ద లెజెండ్’అనే ఇంగ్లీష్ సెంటెన్స్ లతో మొదలై అమితాబ్ ను రివీల్ చేశారు. ఓ లెజెండ్ లేకుండా లెజండరీ సినిమాను మేము ఎలా రూపొందిస్తాం అని చెప్పారన్నమాట. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ను ఒకే వేదికపై తెస్తున్నాం అని వైజయంతీ బ్యానర్ గర్వంగానే ప్రకటించింది. నిజంగానే ఇది ఎవరూ ఊహించలేదు కూడా. అమితాబ్ ఎంట్రీతో సినిమా రేంజ్ కూడా మారుతుందని చెప్పొచ్చు. ఏదేమైనా ఆదిపురుష్ ముందా.. లేక నాగ్ అశ్విన్ సినిమా ముందా అనే చర్చలు జరుగుతోన్న టైమ్ లో వీరు ఏకంగా అమితాబ్ ను కూడా ప్రకటించడంతో ఫ్యాన్స్ లో మరింత కిక్ మొదలైంది. ఏదేమైనా ప్రభాస్ ఇక టాలీవుడ్ హీరో ఎంతమాత్రం కాడు అని ఈ రెండు సినిమాలూ చెప్పబోతున్నాయి.

 

 

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here