నాగార్జునతో కూడా యాక్షన్ ఎంటర్టైనరే

49
Nag new movie
Nag new movie

Nag new movie

అక్కినేని నాగార్జున .. దూకుడు పెంచాడు. కానీ సడెన్ గా వచ్చిన కరోనా అతని దూకుడు అడ్డుకట్ట వేసింది. అయితే అనౌన్స్ మెంట్ ను కరోనా ఆపలేదు కదా. అందుకే కొన్నాళ్లుగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నట్టుగా వస్తోన్న వార్తలను కన్ఫార్మ్ చేశారు. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు నాగార్జున. అయితే ఈ సారి గత మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఉండేలా సరైన ప్లానింగ్ తో వస్తున్నట్టుగా కనిపిస్తోంది. వైల్డ్ డాగ్ అనే మూవీలో ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ ఇంకో షెడ్యూల్ షూటింగ్ బ్యాలన్స్ ఉంది. తర్వాత ప్రవీణ్ సత్తారుతో సినిమా అఫీషియల్ గా ప్రకటించారు. ఇంతకు ముందు రాజశేఖర్ హీరోగా గరుడవేగ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ప్రవీణ్ సత్తారు. ఈ మూవీలో కూడా అతని హీరో ఎన్ఐఏ ఆఫీసర్ కావడం విశేషం. ఇప్పుడు వేరొకరి దర్శకత్వంలో అలాంటి ఆఫీసర్ పాత్ర చేస్తోన్న నాగ్ తో సినిమా చేస్తున్నాడు.

ఏసియన్ ఫిల్మ్ అధినేత సునిల్ నారంగ్ తో పాటు మరో ఇద్దరు నిర్మాతలు సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ చిత్రం కూడా కంప్లీట్ గా యాక్షన్ ఎంటర్టైనరే అంటున్నారు. అంటే మరో గరుడవేగ లాంటి సినిమా ఎక్స్ పెక్ట్ చేయొచ్చేమో. ప్రవీణ్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ డిఫరెంట్ జానర్స్ లో వచ్చినవే. ఫస్ట్ టైమ్ యాక్షన్ జానర్ ను రిపీట్ చేస్తున్నాడు అనుకోవచ్చు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. నాగార్జున.. వైల్డ్ డాగ్ పూర్తి చేసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందట. ఇక నాగార్జున వచ్చే నెల నుంచి బిగ్ బాస్- 4 షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తాడు. అంటే టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ లో కరోనా టైమ్ లో మేకప్ వేసుకుని కెమెరాను ఫేస్ చేయబోతోన్న ఫస్ట్ స్టార్ గానూ నాగ్ నిలుస్తాడని చెప్పొచ్చు. ఏదేమైనా వెటరన్స్ తో ప్రవీణ్ సత్తారు చాలా కంఫర్ట్ గా ఉన్నట్టున్నాుడ. అందుకే రాజశేఖర్ తర్వాత నాగ్ తో వెళుతున్నాడు.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here