నాగార్జునకి దర్శకుడు కావలెను

34
nag wants director
nag wants director

nag wants director

అక్కినేని నాగార్జున ఇప్పుడు మంచి దూకుడు మీదున్నాడు. కానీ అతని దూకుడుకు కరోనా అడ్డుకట్ట వేసింది. లేదంటే ఇప్పటికే మూడో సినిమా కూడా అనౌన్స్ చేసిఉండేవాడు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నాడు నాగ్. ఈ మూవీ తర్వాత వరుసగా సినిమాలు రెడీ చేసి పెట్టుకున్నాడు. వీటిలో ప్రధానంగా ప్రవీణ్ సత్తారుతోసినిమా వైల్డ్ డాగ్ పూర్తి కాగానే స్టార్ట్ అవుతుంది. ప్రభు సోలోమన్ డైరెక్షన్ లో రూపొందుతోన్న  వైల్డ్ డాగ్ ఒక షెడ్యూల్ తో పూర్తవుతుంది. ఈ మూవీలో నాగ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తాడు. దియా మీర్జా, సయామీఖేర్ ఫీమేల్ లీడ్ గా నటిస్తారు. ఇక ఈ మూవీ తర్వాత వచ్చే యేడాది ఆరంభంలోనే ప్రవీణ్ సత్తారు సినిమా స్టార్ట్ అవుతుంది. అదే టైమ్ లో సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్ కూడా ఉంటుంది. అయితే ఇంతకు ముందే నాగ్ బాలీవుడ్ లో హిట్ అయిన ‘రైడ్’ సినిమా రైట్స్ తీసుకున్నాడు. దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని బలంగా అనుకుంటన్నాడు. కాకపోతే ఈ రీమేక్ ను హ్యాండిల్ చేసే దర్శకుడు కనిపించడం లేదట నాగ్ కు. రైడ్ సినిమాలో అజయ్ దేవ్ గణ్, ఇలియానా నటించారు.

ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ లో పనిచేస్తోన్న నిజాయితీ పరుడైన ఓ ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నేపథ్యంలో కథ నడుస్తుంది. అక్కడ మంచి విజయం సాధించింది. తెలుగులో ఇంకాస్త డ్రామాగానూ మార్చే అవకాశం ఉంది. అలాంటి మార్పులు చేసే సత్తా ఉన్న దర్శకుడి కోసమే నాగ్ ఎదురు చూస్తున్నాడట. అయితే ఇప్పటి వరకూ అతనికి సరైన దర్శకుడే దొరక్కపోవడం కాస్త విశేషం అనే చెప్పాలి. అయితే ఇలాంటి కథలు హ్యాండిల్ చేయాలంటే దర్శకుడికి కేవలం సినిమా పై ప్యాషన్ మాత్రమే కాదు.. సొసైటీపై అవగాహన కూడా అవసరం.అలాంటి దర్శకులు మన దగ్గర(ఎవరు ఫీలైనా సరే) చాలా అంటే చాలా తక్కువనే చెప్పాలి. ఏదేమైనా నాగార్జునకు ఇష్టమైన ఈ సినిమా కేవలం సరైన దర్శకుడు కుదరకపోవడం వల్లే ఇంకా మొదలు కాలేదనేది కొంత ఆశ్చర్యమే. మరి త్వరలోనే నాగ్ కు మంచి దర్శకుడు దొరకాలని.. తెలుగులో నాగ్ కూడా సూపర్ హిట్ రైడ్ చేయాలని కోరుకుందాం..

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here