nag with young music director
నాగార్జున హీరోగా.. నిర్మాతగా రూపొందిస్తోన్న చిత్రం `మన్మథుడు 2`. 17 ఏళ్ల క్రితం నాగార్జున నటించిన `మన్మథుడు` చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. మార్చి 12న సినిమా ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమా కోసం `ఆర్.ఎక్స్ 100 `యూనిట్ నుండి నాగ్ ఇద్దరిని ఎంపిక చేసుకున్నాడట. అందులో ఒకరు హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ కాగా.. మరో వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్. ఈ సినిమా ఎక్కువ భాగం యూరప్‌లోని పోర్చుగల్‌లో చిత్రీకరిస్తారట. అందులో భాగంగా ముందుగా విదేశీ షెడ్యూల్‌నే స్టార్ట్ చేస్తారట. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా అనుష్క శెట్టి నటించే అవకాశాలున్నాయని సమాచారం.
Check out here For More News
For More Interesting and offers