ఈ టైటిల్ ఎక్కుతుందంటావా ‘నాగేశ్వరరావ్’

Naga Chaitanya As “Nageswara Rao”

నాగచైతన్య.. మెల్లగా కెరీర్ ను పట్టాలెక్కించుకున్నాడు. కొన్నాళ్ల క్రితం మాస్ ఇమేజ్ మోజులో పడి లాస్ అయిన చైతూ.. ప్రేమమ్ తర్వాత ఆ తరహా కథలే తనకు నప్పుతాయని తెలుసుకున్నా.. అంతకు ముందే ఒప్పుకున్న కొన్ని ఫ్లాపులు మోయక తప్పలేదు. ఇక సమంత తన లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కుర్రాడి ఫేట్ మారిపోయిందనిపిస్తోంది. మజిలీతో మెమరబుల్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సాయి పల్లవి హీరోయిన్ గా ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్నాడు. సమ్మర్ బరిలో ఈ మూవీ ఏప్రిల్ 17న విడుదల కాబోతోంది. అలాగే ఆల్రెడీ గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో సినిమా కమిట్ అయి ఉన్నాడు. ఇది కూడా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనరే అని చెబుతున్నారు.

ఇక పరశురామ్ సినిమా కోసం ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ అనుకుంటున్నారట. అదే ‘నాగేశ్వరరావు’. యస్ .. సినిమా టైటిలే అది అంటున్నారు. గతంలో మనం సినిమాలో చైతూ పాత్ర పేరు కూడా అదే. తాతగారి పేరుతో ఈ సారి ఏకంగా సినిమా టైటిలే అంటే ఇంట్రెస్టింగే. అయితే నేటి కాలంలో ఈ పేరు ఎంత వరకూ రీచ్ అవుతుందనేదీ అనుమానించాల్సిన విషయమే. అయితే కంటెంట్ బలంగా ఉంటే, ఇదీ కథలో భాగమే అయితే ఖచ్చితంగా మెప్పిస్తుంది. ఒక్కోసారి ఇదే ప్లస్ అయినా ఆశ్చర్యం లేదు. మొత్తంగా నాగ చైతన్య నాగేశ్వరరావుగానే వచ్చేలా కనిపిస్తున్నాడట.

Naga Chaitanya As “Nageswara Rao”,#Parashuram,chaitu latest news

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article