నాగ చైతన్య మరో బెస్ట్ స్టెప్

29
Naga chaitanya best step
Naga chaitanya best step

Naga chaitanya best step

నాగచైతన్య ఫిజిక్ అండ్ పర్సనాలిటీకి యాక్షన్ కథలు సూట్ కావు అని ఆడియన్స్ తొలి నాళ్లలోనే తేల్చారు. కానీ నాగార్జున మాత్రం తనయుడుకి మాస్ ఇమేజ్ తీసుకురావాలని ఆ తరహా కథలే సెలెక్ట్ చేసుకున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన ప్రేమమ్ తో చైతూకు సైతం తన బలమేంటో.. తను ఎలా ఉంటే ఆడియన్స్ కు నచ్చుతుందో అర్థమైంది. అప్పటి నుంచి కాస్త రూట్ మార్చాడు. అప్పటికే కమిట్ అయిన సవ్యసాచి లాంటి సినిమా ఫలితం కూడా చైతూ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చు. మొత్తంగా బలమైన కథలకే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాడు. తన కోసం కొత్తగా ఏ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అనే డిమాండ్స్ చేయడం లేదు. అందుకే మజిలీ వంటి మెమరబుల్ హిట్ వచ్చింది. ఇప్పుడు శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ అంటూ పూర్తిగా కొత్తదనం ఉన్న కథతో రాబోతున్నాడు. ఈ టైమ్ లో పరశురామ్ తో సినిమా పోస్ట్ పోన్ కావడంతో లేటెస్ట్ గా అతని వద్దకు మరో మంచి కథ వచ్చింది. కేవలం కథలను మాత్రమే నమ్మి అందుకు సూట్ అయ్యే ఆర్టిస్టులను తీసుకుంటూ విజయాలు అందుకుంటోన్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో నాగచైతన్య సినిమా ఒకటి ఫైనల్ అయింది.

ఈ కాంబినేషన్ పై చిన్న క్లూ కూడా లేకుండా ఏకంగా కన్ఫార్మ్ కావడం కొంత విశేషంగానే చెప్పాలి. మోహనకృష్ణ చెప్పిన ఓ అర్థవంతమైన ప్రేమకథకు చైతూ స్పెల్ బౌండ్ అయ్యాడట. వినగానే ఓకే చెప్పాడని సమాచారం. ప్రస్తుతం చైతూ చేస్తోన్న లవ్ స్టోరీ మూవీ ఇంకా కొన్ని రోజులే షూటింగ్ బ్యాలన్స్ ఉంది. తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. విక్రమ్ మూవీలో సమంత హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయంటున్నారు. ఇక విక్రమ్ సినిమాతో పాటుగానే ఇంద్రగంటి సినిమా కూడా ఏకకాలంలో షూటింగ్ ఉండేలా చైతన్య ప్లాన్ చేసుకున్నాడంటున్నారు. అయితే ఈ మూవీలో కూడా సమంతనే హీరోయిన్ అయితే బావుంటుంది అనేది ఇంద్రగంటి ఒపీనియన్ అట. మరి అందుకు సమంత ఏం చెబుతుందో కానీ.. ఈ రెండిటిలో ఏదో ఒక మూవీలో మళ్లీ ఈ రియల్ జంట రీల్ జంటగా అలరించడం ఖాయం అంటున్నారు. ఏదేమైనా ఈ టైమ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ బిల్డ్ చేసుకుంటూ ఇంద్రగంటి వంటి దర్శకుడి సినిమా ఓకే చేయడం చైతూ వేసిన బెస్ట్ స్టెప్ అనే చెప్పాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here