సుకుమార్ నిర్మాత‌గా నాగ‌శౌర్య కొత్త చిత్రం

Naga Sourya was acting in Sukumars Movie
దర్శ‌కుడిగా భారీ చిత్రాల‌ను తెర‌కెక్కిస్తోన్న ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లో త‌న ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ ఇత‌ర ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి సినిమాల‌ను రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్ శ‌ర‌త్ మ‌రార్ క‌ల‌యిక‌లో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న కాశీ విశాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article