బాలయ్యకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన నాగబాబు

Nagababu Gave Final warning to Balakrishna… ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా

నందమూరి బాలకృష్ణ పై వివాదాస్పద వ్యాఖ్యలతో, సోషల్ మీడియా పోస్టులతో చెలరేగిపోతున్న నాగబాబు ఎట్టకేలకు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. గతంలో ఐదుసార్లు బాలకృష్ణ తమ కుటుంబంపై మాటలతో చేసింది దాడికి నిరసనగా నే ఆయన ఈ విధంగా స్పందించారు అని చెప్పారు. బాలకృష్ణ మెగా ఫ్యామిలీని ఏ విధంగా కించ పరిచారు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు వీడియో పెడుతున్న నాగబాబు ఆ వీడియోలో బాలకృష్ణ తమను కించపరిచిన అంశాన్ని ప్రస్తావిస్తూ దానికి కౌంటర్ ఇస్తున్నారు.
ఎప్పుడు 2012లో జరిగిన విషయాన్ని కూడా గుర్తు చేసి మరీ బాలయ్య కి కౌంటర్ ఇచ్చారు నాగబాబు. 2012లో బాలకృష్ణ చిరంజీవిని చిరంజీవి ఎన్టీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు అని మాట్లాడారట. అప్పుడు మెగా ఫ్యామిలీ అందరూ తెగ బాధపడిపోయారు అయితే ఆ రోజుల్లో సోషల్ మీడియా అందుబాటులో లేకపోవడంతో ఈ విషయం అందరికీ తెలియ చేస్తే పరిస్థితి లేదని ఇక ఆ విషయంలో కూడా ఇప్పుడు తాను స్పందిస్తానని చెప్పారు నాగబాబు. ఎన్టీఆర్ మీకు గొప్పగా వచ్చు కానీ మాకు మా అన్న చిరంజీవే గొప్ప. మెగా ఫ్యామిలీ లో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే సర్దుకుపోయి ఉండేవాళ్ళు మే కానీ బయట రోడ్డు మీద పడి కొట్టుకునే ర కాలం కాదు. అంతగా కలిసి ఉండే మా కుటుంబం పై అవాకులు చవాకులు పేలితే ఈ గురించి ఇలాగే స్పందిస్తానని నాగబాబు బాలకృష్ణ కు వార్నింగ్ ఇచ్చారు. గత నెల రోజులుగా నాగబాబు చేస్తున్న ఆరోపణలు, నాగబాబు ఇస్తున్న కౌంటర్లు, అన్నీ వింటూ అన్నీ చూస్తూ కూడా ఇప్పటివరకు బాలకృష్ణ ఒక్క మాట కూడా మాట్లాడలేదు .ఈ విషయంపై బాలయ్య బాబు ని మీడియా ప్రశ్నిస్తే నో కామెంట్ అంటూ బాలయ్య వెళ్ళిపోయాడు.
ఇక రాజకీయాల్లో ఉన్న కళ్యాణ్ బాబును రాజకీయంగా ఎన్నైనా అనుకోండి దానిని మేము పట్టించుకోము కానీ అదే వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం ఇలాగే స్పందిస్తాను అంటూ నాగబాబు వివరణ ఇచ్చారు. మొత్తానికి ఇన్ని రోజులుగా బాలయ్య పై విమర్శలు గుప్పించిన నాగబాబు ఇప్పటికైనా ఈ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లేనా… లేక మళ్లీ దీనిని కొనసాగిస్తా రా అని అటు రాజకీయ వర్గాల్లోనూ , ఇటు సినీ పరిశ్రమలోనూ చర్చ జరుగుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article