నిహారికకు సంబంధాలు చూస్తున్నాం

NAGABABU SEARCHING FOR SON-IN-LAW

మోగా బ్రదర్ నాగబాబుకి తన కుమార్తె వివాహం విషయంలో కుల పట్టింపుల్లేవని వెల్లడించారు. ప్రస్తుతం నిహారికకు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నామని, త్వరలోనే పెళ్లి చేస్తామని చెప్పారు. నాగబాబు తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో తన కుమార్తె వివాహ ప్రస్తావన రావడంతో పలు ఆసక్తికరమైన విషయాలు వివరించారు. ‘నిహారిక ఇష్టం మేరకు సినిమాల్లో నటిస్తా అని చెప్పడంతో అంగీకరించాను. కానీ ఆమె నటించిన చిత్రాలు సరిగా ఆడలేదు. వెబ్ సిరీస్ తో మాత్రం సక్సెస్ అయింది. ఇప్పుడు సూర్యకాంతం చిత్రంలో నటిస్తోంది. ఆమె సినిమాల్లోకి వచ్చేటప్పుడే మరో రెండు మూడేళ్లలో పెళ్లి చేస్తా అని చెప్పా. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అందుకే మంచి కుర్రాడి కోసం చూస్తున్నాం. నాకు కుల పట్టింపులు పెద్దగా ఉండవు. అబ్బాయి మంచోడు అయి ఉండి.. తన కాళ్ల మీద తాను నిలబడి మంచి వ్యక్తిత్వం ఉన్న వాడైతే చాలు. మా కులంలో అలాంటి సంబంధం వస్తే మంచిదే.. లేదంటే వేరే కులం వ్యక్తి అయినా అభ్యతరం లేదు. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేయాలనే ఆంక్షలేమీ లేవు. కుటుంబ నేపథ్యం బాగుండి.. మంచి గుణం, పద్ధతైన కుర్రాడైతే చాలు. అలాంటి సంబంధం వస్తే పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నాం’ అని నాగబాబు వెల్లడించారు.

TELUGU CINEMA

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article