Roja Sensational comments
కొణిదెల, నందమూరి కుటుంబాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. బాలకృష్ణ ఎవరో తనకు తెలియదన్న నాగబాబుపై బాలకృష్ణ ఫ్యాన్స్ కోపాన్ని ప్రదర్శిస్తే, దానికి ప్రతిగా నాగబాబు వివిధ సందర్భాల్లో బాలకృష్ణ తమ మెగా బ్రదర్స్‌ను అవమానించిన సందర్భాలను గుర్తు చేస్తూ కౌంటర్ ఇస్తున్నాడు. అమితాబ్ ఏం పీకాడు, చిరంజీవి ఏమయ్యాడు, మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అన్న మాటలకు నాగబాబు కౌంటర్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ “స్వర్గీయ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టారో .. అమితాబ్ అంతే పెద్ద స్టార్, కన్నడ స్వర్గీయ రాజ్‌కుమార్‌గారు, ఎంజిఆర్‌గారు అంతే పెద్ద స్టారు.. ఆయనలాంటి వ్యక్తిని ఏం పీకాడు అంటే బాధేసింది. చిరంజీవి ఏమయ్యాడు అన్నారు.. మీ టాపిక్‌లో మా పేరు అవసరమా.. దాన్ని కూడా మేం పట్టించుకోలేదు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అన్నారు. ఏంటి బ్లడ్.. బ్రీడ్.. మీరేమైనా అకాశం నుండి దిగొచ్చారా, మీరేమైనా మహారాజా సూర్య వంశీకులా, మమ్మల్ని అవమానిస్తే మాకు కోపం రాదా.. బాలకృష్ణను అన్నందుకు ఎవరైతే ఫీల్ అవుతున్నారో వారికి నేను చెప్పేది ఒకటే అంతుకు ముందు వారిని బాలయ్య ఎమన్నారో అని ఆలోచించుకోవాలి. బ్లడ్, బ్రీడ్ మనుషులు చూస్తారా.. అప్పుడెప్పుడో బ్లూ బ్లడ్ అని చెప్పిన నియంతలను సామాన్య జనాలు తొక్కేసి ప్రజాస్వామ్యాలను స్థాపించుకున్నారు. అయినా మేం ఏమీ అనలేదు. ఎందుకంటే చిరంజీవి, పవన్‌కల్యాణ్, చరణ్ బాబు, వరుణ్ ఇలా అందరం కామ్‌గానే వెళ్లేవాళ్లు. కాంట్రవర్సీలకు వెళ్లం. నేను కూడా వాళ్ల మాట విని.. ఏ మాటలు మాట్లాడలేదు. కానీ బ్లడ్ వేరు.. బ్రీడ్ వేరు అనడం సరికాదు. మీరేమీ దైవాంశ సంభూతులు కారు. వీరు ఒక తల్లిదండ్రులకు పుట్టినవాళ్లే. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు.. ఎవరైనా సాధించవచ్చు. గెలవొచ్చు. చాలా సాధారణమైన కుటుంబాల నుండి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. మీరొక్కళ్లే కాదు. ఒకసారి మేం ఫెయిల్ అయ్యుండొచ్చు. అలాగని లైఫ్ లాంగ్ ఫెయిల్ కాము. ఒకసారి సక్సెస్ అయితే లైఫ్ లాంగ్ సక్సెస్ కాము. అంతెందుకు.. మీ తండ్రిగారిని..అంత మహానుభావుడ్ని మీ బావగారు వెన్నుపోటు పొడిస్తే మీరేం చేశారు. ఆయన జీవితాన్ని మీరేం చేశారు. అది తప్పు కాదా.. అప్పుడు మీ బ్లడ్, బ్రీడ్ ఏమయ్యింది. కన్నతండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తులున్నారు. వాళ్లకి మీరేం సమాధానం చెప్పారు ఆరోజు“ అన్నారు నాగబాబు.
For more new updates Click Here
Subscribe to TSNEWS.TV