మీరు ఆకాశం నుంచి ఊడిపడ్డారా?

Nagababu Sensational Comments on Balakrishna

  • బాలయ్యపై నాగబాబు విసుర్లు
  • బాలకృష్ణ వ్యాఖ్యలకు వరుసగా కౌంటర్లు ఇస్తున్న నాగబాబు

బాలకృష్ణ, నాగబాబు మధ్య మొదలైన సోషల్ యుద్ధం మరింత ముదిరింది. పవన్ కల్యాణ్ ఎవరో తెలియదంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలకు నాగబాబు ఇచ్చిన కౌంటర్ తో మొదలైన ఈ ఎపిసోడ్.. ఇంకా కొనసాగుతోంది. బాలకృష్ణ ఎవరో తెలియదని నాగబాబు వ్యాఖ్యానించడం.. తర్వాత బాలకృష్ణ అంటే పాత తరం కమెడియన్ కదా.. ఆయన్నెందుకు మరచిపోతాను అంటూ సెటైర్ వేయడంతో వార్ షురూ అయింది. సోషల్ మీడియా వేదికగా నందమూరి అభిమానులు నాగబాబుపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో అసలు తన వ్యాఖ్యలకు కారణమేంటో, ఎందువల్ల అలా మాట్లాడానో పేర్కొంటూ నాగబాబు వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు మూడు వీడియోల్లో వివరణ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఎవరో తెలియదని బాలయ్య వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ.. పవన్ అందరికీ తెలియాల్సిన అవసరం లేదన్నారు. అయితే, సినీహీరోగా పవన్ ఎవరో తెలియదని చెప్పడం తప్పు కాదని.. కానీ రాజకీయంగా పవన్ మద్దతు తీసుకుని, ఎన్నికల్లో గెలిపొందిన అనంతరం ఇలా మాట్లాడటం సబబు కాదన్నారు. ‘బాలయ్య ఎవరో నాకు తెలియదు అంటే రాద్ధాంతం చేస్తున్న నందమూరి అభిమానులు గతంలో బాలయ్య కామెంట్లకు ఏం సమాధానం చెబుతారు. బాలకృష్ణ బావ చంద్రబాబు మా ఇంటికి వచ్చి పవన్‌ కళ్యాణ్‌ను స్వాగతించి రాజకీయంగా వాడుకున్నారు. జగన్‌ గెలవాల్సిన సమయంలో సీనియారిటీ ఉన్న నాయకుడని చంద్రబాబును నమ్మి టీడీపీకి పవన్‌ మద్దతు తెలిపారు. కనీసం ఒక్క సీటు కూడా జనసేన పోటీ చేయకపోయినా టీడీపీ గెలుపుకోసం పవన్‌ చాలా కష్టపడ్డారు. ఎన్నికల్లో గెలిచాక పవన్‌ కళ్యాణ్‌ ఎవరోతెలీదు అనడం ఎంత వరకు సబబు. మీరు అనొచ్చు కానీ, మేము తెలియదంటే కోపమొస్తుందా’ అని ప్రశ్నించారు. ఒకరిని హీరో చేయడం ఇష్టం ఉండదు.. మేమే స్టార్లు అంటూ బాలయ్య చేసిన మరో వ్యాఖ్యపై నాగబాబు రెండో వీడియోలో స్పందించారు. పేరున్న ప్రతి ఒక్కరూ స్టారేనని వ్యాఖ్యానించారు. ‘మా బ్లడ్‌ వేరు మా బ్రీడు వేరూ అంటూ బాలయ్య అంటూ ఉంటారు. నందమూరి హీరోలు ఆకాశం నుంచి వచ్చారా? మీరు మాలాగే మనుషులు. తల్లిదండ్రులకు పుట్టినవారే’ అని మరో వీడియోలో కౌంటర్ ఇచ్చారు. ‘మా బ్లడ్, మా బ్రీడ్ అంటున్నారు.. మీ తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావుగారిని మీ బావ చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు ఏమైంది మీ బ్లడ్’ అని ప్రశ్నించారు. తమ అన్నతమ్ముళ్ల మీద బాలయ్య 6 సార్లు కామెంట్లు చేస్తే, తిరిగి సీరియస్‌గా కాకుండా ఫన్నీగా కౌంటర్‌ ఇచ్చానని తెలిపారు. అమితాబ్‌ బచ్చన్‌ ఏం పీకాడు? చిరంజీవి ఏమయ్యాడంటూ తమను హేళనపరిచేలా బాలయ్య వ్యాఖ్యలు చేసినందుకే చాలాకాలం ఓపిక పట్టిన అనంతరం తాను ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article