No one can ask you to put up with you
లేపాక్షి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా చిరంజీవిని పిలిచారా.. అని విలేకర్లు అడిగితే లేదండి. “మా గ్లామర్ చాలు. ఎవడిని నెత్తిన ఎక్కించుకుని కూర్చోబెట్టుకోను. నా పద్ధతిలో నేను వెళతా డిక్టేటర్ పద్ధతిలో .. ఎవరేమనుకున్నా“ అని బాలయ్య అన్నారు. ఇది బాలయ్య చిరంజీవిని ఉద్దేశించి చేసిన నాలుగో కామెంట్, దీనిపై నాగబాబు స్పందిస్తూ, “మిమ్మల్ని నెత్తిన పెట్టుకోమని చిరంజీవిగారు మీకైమైనా ఫోన్ చేశారా, మా వాళ్లు ఎవరైనా చెప్పారా, ఫ్యాన్స్ ఎవరైనా చెప్పారా, నోటి దురుసేంటి?, నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడుతారా? మీ గ్లామర్, మీ పేరు మీరే ఉంచుకోండి. చిరంజీవిగారిని పిలిచారా? అని అడిగితే పిలవలేదని చెబితే సింపుల్‌గా పోయేది. నేను డిక్టేటర్‌లా ప్రవర్తిస్తానని అన్నారు. ప్రవర్తించండి. ఒక ఎమ్మెల్యేగా ఉండి డిక్టేటర్‌లా ప్రవర్తిస్తానని అన్నారు కదా.. చూద్దాం నెక్ట్స్ ఎలక్షన్స్‌లో ఏమవుతుందో, ఒక నియంతలా ప్రవర్తిస్తున్నారు కదా, గెలవండి అదే హిందూపూర్‌లో. ఆయన అన్న మాటలకు మేం కామెంట్ చేయేలేదు. ఎందుకంటే నేను, మా అన్నయ్య, తమ్ముడు శాంతిపరులం. ఎవరు ఎన్ని మాట్లాడినా, మేం ఏమీ అనలేదు. చాలా కోపం అవేశం, బాధ కలిగినా ఎందుకులే అని నేను కామ్‌గా ఉండిపోయేవాడిని. మేం కంట్రోల్‌గా ఉంటున్నాం కానీ.. మీరు కంట్రోల్‌గా లేరు. మీరు అపాయింట్ చేసిన వ్యక్తులు కంట్రోల్‌గా లేరు. మీరు మీడియాలో మాట్లాడించిన వ్యక్తులు కంట్రోల్‌గా లేరు. వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నారు. మీ వాళ్లతో చాలా దుర్మార్గంగా మాట్లాడించారు. ఆయన సరే మేం నోరు మూసుకున్నాం. మేం కామెంట్ చేయేలేదు“ అన్నారు.
For more new updates Click Here
Subscribe to TSNEWS.TV