లోకేశ్ పై నాగబాబు సెటైర్లు

NAGABABU SETIRES ON LOKESH

  • టీడీపీ గురించి నిజం అంగీకరించాలని వ్యంగాస్త్రం
  • మై ఛానెల్ నా ఇష్టం పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన మెగా బ్రదర్

మొన్నటి వరకు సినీనటుడు బాలకృష్ణపై వ్యంగాస్త్రాలు సంధించిన మెగా బ్రదర్ నాగబాబు.. ఈ సారి ఏపీ మంత్రి లోకేశ్ ను టార్గెట్ గా చేసుకున్నారు. ‘లోకేశ్ చాలా నిజాయతీపరుడని, ఆయన మాటలు వింటే తనకు పిల్లలూ దేవుడూ చల్లనివారే, కల్లకపటమెరుగని కరుణామయులే అనే పాట గుర్తుకు వస్తుందని సెటైర్లు వేశారు. ‘మై ఛానెల్‌ నా ఇష్టం’ పేరిట యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన నాగబాబు.. అందులో రాజకీయపరమైన అభిప్రాయాలు పంచుకుంటానని చెప్పారు. అవన్నీ సరదగా నవ్వుకోడానికేనని, ఎవరూ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాజకీయపరమైన విమర్శలు మాత్రం చేస్తానని, వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లనని స్పష్టంచేశారు. ఎప్పుడు ఎక్కడా చూడనవి, ఒకవేళ చూసినా నిశబ్ధంగా మరిచిపోయేలా చేసిన అంశాలను తన ఛానెల్ లో చూపిస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా లోకేశ్ పై వ్యంగాస్త్రాలు సంధించారు. గతంలో లోకేశ్ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..  ‘అవినీతి, బంధుప్రీతి, మతపిచ్చి,కులపిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదన్న ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీయే’ అని చేసిన వ్యాఖ్యలను చూపించి.. సెటైర్లు వేశారు. ‘థ్యాంక్యూ లోకేష్‌ మీ పార్టీ గురించి చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత నిజాయితీగా మాట్లాడే రాజకీయ నాయకుడే లేడు. లోకేశ్ కు ఒక్క ఓ వేసుకుందాం’ అంటూ కామెడీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article