నోముల తనయుడికే టీఆర్ఎస్ టికెట్

169

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎవరికి టికెట్ ఇవ్వాలనేన అంశంపై అధికార టీఆర్ఎస్ పార్టీ ఉత్కంఠకు తెర దించింది. నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ కే సాగర్ టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. నామినేషన్లు వేయడానికి మంగళవారం చివరి రోజు అయిన నేపథ్యంలో సోమవారం తన అభ్యర్ధి విషయంలో స్పష్టత ఇచ్చింది. నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి బరిలోకి దిగుతుండగా.. టీఆర్ఎస్ భగత్ ను ఎంపిక చేసింది. నోముల కుటుంబానికి న్యాయం చేయడంతోపాటు జానారెడ్డిని ఢీకొట్టడానికి భగత్ అయితేనే సరైన అభ్యర్థి అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తన అభ్యర్థిని ప్రకటించాలని వేచి చూస్తున్నా బీజేపీ.. ఈ విషయాన్ని సోమవారమే తేల్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here