ఇద్ద‌రు భామ‌ల‌తో మ‌న్మ‌థుడు

Nagarjuna with double actress
17 ఏళ్ల క్రితం నాగార్జున అక్కినేని ఇద్దరు ముద్దుగుమ్మ‌లు సోనాలి బింద్రే, అన్షుల‌తో చేసిన `మ‌న్మ‌థుడు` బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. రాహుల్ రవీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సీక్వెల్ తెర‌కెక్క‌నుంది. ఈ సీక్వెల్‌లో కూడా ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించ‌బోతున్నారు. అందులో ఒక‌రు పాయ‌ల్ రాజ్‌పుత్ అని వార్త‌లు విన‌ప‌డుతున్న త‌రుణంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని కూడా రాహుల్ ఈ సినిమా కోసం సంప్ర‌దించాడ‌ట‌. నాగార్జున త‌న‌కు గాడ్‌ఫాద‌ర్‌లా సినీ కెరీర్ ప్రారంభంలో స‌పోర్ట్ చేశాడు కాబ‌ట్టి అనుష్క కూడా ఓకే అంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే అప్ప‌టి మ‌న్మ‌థుడు లాగానే సీక్వెల్‌లో కూడా ఇద్ద‌రు భామ‌ల‌తో నాగ్ తెర‌పై రొమాన్స్ చేస్తాడు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article